TikTok Comeback 2022: రెండేళ్ల తర్వాత భారత్‌లోకి టిక్‌టాక్ రీఎంట్రీ.. ప్రభుత్వం నిషేధం ఎత్తివేయనుందా..?

First Published | Jun 4, 2022, 6:42 PM IST

2020 సంవత్సరంలో టిక్‌టాక్‌తో సహా ఎన్నో చైనీస్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి మీకు తెలిసిందే. వాటిలో ప్రముఖ మొబైల్ గేమ్ PUBG కూడా ఉంది. అయితే PUBG ఇండియాలోకి ఒక కొత్త పేరుతో రిఎంట్రీ ఇచ్చింది కానీ ఇప్పటికీ చాలా యాప్‌లు తిరిగి వచ్చే మార్గం కోసం చూస్తున్నాయి. తాజాగా టిక్‌టాక్ రెండేళ్ల తర్వాత మళ్ళీ ఇండియాకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
 

TikTok మాతృ సంస్థ ByteDance భారతదేశంలో పార్ట్నర్ కోసం వెతుకుతోంది. అలాగే ఈ భాగస్వామ్యాం ద్వారా TikTok రిఎంట్రీ  ఇచ్చేందుకు సిద్ధమవుతోంది అలాగే TikTokని రి-లాంచ్ చేయడంలో ఈ భాగస్వాములు సహాయం చేస్తారు. అలాగే ఈ భాగస్వాములు కొత్త ఉద్యోగులను నియమించుకొనున్నారు.
 

 ఒక నివేదిక ప్రకారం, బైట్‌డాన్స్ భారతదేశానికి తిరిగి రావడానికి హీరానందని గ్రూప్‌తో చర్చలు జరుపుతోంది. ఈ గ్రూప్ యోట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ పేరుతో డేటా సెంటర్ వ్యాపారం ఉంది. ఇండియాలోకి రిటర్న్‌కు సంబంధించి బైట్‌డాన్స్ ఇంకా ప్రభుత్వాన్ని సంప్రదించలేదని సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.

Latest Videos


TikTok నిజంగా తిరిగి వచ్చినట్లయితే భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం  పని చేయాల్సి ఉంటుంది అలాగే భారతదేశంలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. TikTok తిరిగి రావడానికి PUBG  మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్  వ్యూహంపై కూడా ByteDance పని చేస్తుంది. TikTok ఇప్పుడు భారతీయ మార్కెట్లో కొత్త ప్లేయర్స్  చింగారి, MX Taka Tak, Instagram రీల్స్‌తో పోటీపడుతుంది. టిక్‌టాక్‌ బ్యాన్ తరువాత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇండియాలో  బాగా ప్రాచుర్యం పొందాయి.
 

click me!