Amazfit GTS 2 కొత్త వెర్షన్ కి 1.65-అంగుళాల AMOLED స్క్రీన్ ఉంది. దీనిని మిడ్‌నైట్ బ్లాక్, డెజర్ట్ గోల్డ్ లేదా అర్బన్ గ్రే అల్యూమినియం అల్లాయ్ కేస్ అండ్ మ్యాచింగ్ స్ట్రాప్‌తో లభిస్తుంది. వాచ్ డిస్‌ప్లే ఆప్టికల్ డైమండ్ లాంటి కార్బన్ (ODLC) ఇంకా 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌లతో తయారు చేయబడింది, ఇది స్క్రీన్‌ను అనూహ్యంగా బలంగా చేస్తుంది ఇంకా గీతలు పడకుండా చేస్తుంది.
ఈ వాచ్ 50కి పైగా వాచ్ ఫేస్ ఆప్షన్స్ తో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లేతో వస్తుంది. హార్ట్ బీట్ మానిటర్‌తో పాటు బయోట్రాకర్ 2 PPG ఆప్టికల్ సెన్సార్‌ను కూడా పొందుతుంది. రక్తంలోని ఆక్సిజన్‌ను ట్రాక్ చేసే సెన్సార్ కూడా ఇందులో ఉంది.