టిక్‌టాక్ 2021 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన మొబైల్ యాప్‌గా అవతరించింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లను అధిగమించి
2021లో గ్లోబల్ డౌన్‌లోడ్‌లలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ వంటి ప్రముఖ యాప్‌లను కూడా టిక్‌టాక్ అధిగమించింది, అయితే వినోదం కేటగిరీలో నెట్‌ఫ్లిక్స్అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గా ఉంది. అయితే షాపింగ్ కేటగిరీలో షాపీ ప్రపంచవ్యాప్తంగా మెరుగైన పనితీరు కనబరిచింది. మరోవైపు అమెరికాలో షాపింగ్ విభాగంలో అమెజాన్ అగ్రస్థానంలో ఉంది. గూగుల్ మ్యాప్స్ ట్రావెల్ యాప్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది, అయితే స్పోటిఫి (Spotify)మ్యూజిక్ అండ్ ఆడియో విభాగంలో జెండా ఎగురవేసింది. ఈ సమాచారం Apptopia నివేదిక నుండి స్వీకరించబడింది.