టెలిగ్రామ్ యూజర్లకు శుభవార్త! ఇతర యాప్స్ లో లేని 3 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ లాంచ్..

First Published | Dec 31, 2021, 2:53 PM IST

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (telegram)2021 చివరి రోజున ఇంట్రెస్టింగ్ ఫీచర్‌లను విడుదల చేసింది. టెక్స్ట్‌లోని భాగాలను దాచడానికి ఆసక్తికరమైన ఫీచర్‌తో కూడిన ఐమెసేజ్ (iMessage)లాంటి రియాక్ట్ ఫీచర్‌ను టెలిగ్రామ్ ఇప్పటి వరకు పొందలేదు. ఈ ఫీచర్‌కు ఇప్పుడు స్పాయిలర్ అని పేరు పెట్టి ప్రవేశపెట్టారు. 

మెసేజింగ్ యాప్‌కి లభించిన మరో ముఖ్యమైన ఫీచర్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్, అయితే మెసేజింగ్ యాప్‌లకు ఈ ఫీచర్ మొట్టమొదటిది. వాట్సాప్, సిగ్నల్ సహా మరే ఇతర మెసేజింగ్ యాప్‌లోనూ మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ లేదు.

మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌లు
టెలిగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు ఎమోజీ ద్వారా మెసేజెస్ కి రిప్లయ్ ఇవ్వొచు. ఈ ఫీచర్ ఇప్పటికే  ఐమెసేజ్, ఫేస్ బుక్ మెసెంజర్ అండ్ Instagramలో అందుబాటులో ఉంది. ఇప్పుడు టెలిగ్రామ్ కూడా దీనిని ప్రవేశపెట్టింది. "టెలిగ్రామ్ యానిమేటెడ్ అండ్ ఇంటరాక్టివ్ ఎమోజీలను జోడించిన మొదటి మెసేజింగ్ యాప్, అలాగే వినియోగదారులకు చాట్‌లో ఎక్స్ప్రెస్ చేయడానికి వివిధ మార్గాలను అందించింది. ఈ ఎమోజీల్లో కొన్ని  భావాలను షేర్ చేయడానికి రియాక్ట్‌తో వస్తాయి ఇంకా మెసేజ్ పంపకుండానే మాట్లాడవచ్చు. మెసేజ్ రిప్లయ్ కి  మెసేజ్ పై ఒకసారి నొక్కి  మీరు పంపాలనుకుంటున్న ఎమోజీల జాబితా నుండి ఒకదానికి ఎంచుకోండి. ఈ రియాక్షన్ ఫీచర్‌ను ప్రైవేట్ చాట్‌లో ఉపయోగించవచ్చు. గ్రూప్స్ ఇంకా టెలిగ్రామ్ ఛానెల్‌లలో రియాక్ట్ ఫీచర్‌లను  ఆన్ చేయాలా వద్దా అనేది గ్రూప్ అడ్మిన్‌లు నిర్ణయిస్తారు. 
 

స్పాయిలర్ ఫీచర్

స్పాయిలర్ ఫీచర్‌ని ఉపయోగించి వినియోగదారులు టైప్ చేస్తున్నప్పుడు వారి టెక్స్ట్‌లోని ఏదైనా భాగాన్ని ఎంచుకోవచ్చు ఇంకా కొత్త 'స్పాయిలర్' ఫార్మాటింగ్‌ని ఎంచుకోవచ్చు. మీరు స్పాయిలర్ ఆప్షన్ ను ఎంచుకున్నప్పుడు మీరు మెసేజ్ లోని ఎంచుకున్న భాగాలను చాట్‌లో అలాగే చాట్ లిస్ట్ ఇంకా నోటిఫికేషన్‌లలో దాచవచ్చు.

Latest Videos


మెసేజ్ ట్రాన్స్లేషన్ ఫీచర్స్ 
మెసేజింగ్ యాప్‌లో ఇప్పటివరకు రూపొందించిన అత్యంత ముఖ్యమైన ఫీచర్స్ లో మెసేజ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్ తీసుకొచ్చిన మొట్టమొదటి యాప్  టెలిగ్రామ్. ఇప్పుడు వినియోగదారులు ఏదైనా మెసేజ్  ని మరొక భాషలోకి అనువదించవచ్చు. ఇందుకు మీరు సెట్టింగ్‌లు>లాంగ్వేజ్ లో  ట్రాన్స్లెట్ ఫీచర్ ఆక్టివేట్ చేయవచ్చు. మెసేజ్ ఎంచుకున్నప్పుడు మెనుకి కొత్త ట్రాన్స్లేషన్ బటన్ జోడించబడుతుంది. టెలిగ్రామ్‌కు మద్దతు ఇచ్చే అన్ని ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది, అయితే ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి ఆపిల్ వినియోగదారులకు ఐ‌ఓ‌ఎస్ 15+ అవసరం. 

click me!