లేటెస్ట్ మోడల్ క్రేన్ల భారీ శక్తికి పాస్కల్ సూత్రం (Pascal’s Law) కారణం. క్రేన్‌లోని హైడ్రాలిక్ సిలిండర్లు ఒత్తిడికి గురైన నూనెతో పనిచేస్తాయి. చిన్న పైపులో ఇచ్చే కొద్దిపాటి ఒత్తిడి, పెద్ద సిలిండర్‌కు చేరేసరికి చాలా రెట్లు పెరుగుతుంది.
భౌతిక శాస్త్ర సమీకరణం ప్రకారం:
P=F/A
(ఒత్తిడి = శక్తి / వైశాల్యం)
ఈ సూత్రం ప్రకారం, ద్రవం వైశాల్యం పెంచడం ద్వారా, టన్నుల కొద్దీ బరువును లేపగల ఎనర్జీ వస్తుంది. అందుకే ఒక చిన్న బటన్ నొక్కితే చాలు, భారీ క్రేన్ కదులుతుంది.
కౌంటర్‌వెయిట్ (Counterweight) - బ్యాలెన్సింగ్ రహస్యం
క్రేన్లు కింద పడిపోకుండా ఉండటానికి ప్రధాన కారణం దాని వెనుక భాగంలో అమర్చే కౌంటర్‌వెయిట్. క్రేన్ లేపే బరువును బ్యాలెన్స్ చేయడానికి, దాని కింది భాగంలో చాలా బరువైన ఇనుము లేదా కాంక్రీట్ దిమ్మలను ఉంచుతారు. ఇది క్రేన్ గురుత్వాకర్షణ కేంద్రాన్ని (Center of Gravity) స్థిరంగా ఉంచి, బరువైన వస్తువులను లేపేటప్పుడు క్రేన్ పడిపోకుండా కాపాడుతుంది.