Telegram Premium:టెలిగ్రామ్ కొత్త సర్వీస్.. ఇప్పుడు నెలకు ఎంత చెల్లించాలంటే..?

Ashok Kumar   | Asianet News
Published : Jun 21, 2022, 07:22 PM IST

మల్టీమీడియా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ప్రీమియం సర్వీస్ ఎట్టకేలకు ప్రారంభించింది. ప్రీమియం సర్వీస్ తో యూజర్లు 4జి‌బి వరకు ఫైల్‌లను అప్‌లోడ్ చేసే సదుపాయాన్ని పొందుతారు. అంతేకాకుండా, వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇంకా వాయిస్ మెసేజ్స్ టెక్స్ట్‌గా మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు టెలిగ్రామ్ యూజర్లు  ప్రతినెల ఆక్టివ్ యూజర్ల సంఖ్య 700 మిలియన్లకు చేరుకుంది.

PREV
12
Telegram Premium:టెలిగ్రామ్ కొత్త సర్వీస్..  ఇప్పుడు నెలకు ఎంత చెల్లించాలంటే..?

ప్రతి నెల ఎంత ఖర్చు అంటే 
భారతీయ మార్కెట్లో, టెలిగ్రామ్ ప్రీమియం సర్వీస్ కి నెలకు రూ. 469 ఖర్చు అవుతుంది, అయితే ఈ ధర ఐఫోన్ యూజర్లకు మాత్రమే. ఆండ్రాయిడ్ యూజర్లు కోసం ప్రీమియం ప్లాన్ ధర గురించి సమాచారం ఇవ్వలేదు.

22

టెలిగ్రామ్ ప్రీమియం  ప్రయోజనాలు
టెలిగ్రామ్ ప్రీమియంకు ప్రతినెల సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత, మీరు 4జి‌బి వరకు ఫైల్‌లను అప్‌లోడ్ చేయవచ్చు ఇంకా సాధారణ యూజర్లతో పోలిస్తే ఫైల్ డౌన్‌లోడ్ కోసం  వేగాన్ని కూడా పొందుతారు. అలాగే టెలిగ్రామ్ ప్రీమియం యూజర్లు 1,000 ఛానెల్‌లను ఫాలో అవ్వోచ్చు. ఇది కాకుండా 20 చాట్ ఫోల్డర్‌లను కూడా సృష్టించవచ్చు. ప్రీమియం యూజర్లు 10 చాట్‌లను పిన్ చేయవచ్చు.  ఇంకా నాలుగు ఖాతాలను కూడా సృష్టించవచ్చు. పేమెంట్ యూజర్లు 10 ఇష్టమైన స్టీక్స్‌లను కూడా సేవ్ చేయవచ్చు. ప్రీమియం యూజర్లు లింక్‌తో లాంగ్ బయోని కూడా వ్రాయవచ్చు. ఇంకా యూజర్లు వాయిస్ మెసేజెస్ టెక్స్ట్‌గా మార్చుకునే అవకాశాన్ని కూడా పొందుతారు. ప్రతి ప్రీమియం యూజర్ ప్రత్యేక బ్యాగేజీని పొందుతారు.
 

click me!

Recommended Stories