కాబట్టి వేరొకరు మీ మెసేజెస్ చదవలేరు ! వాట్సాప్‌ సీక్రెట్ కోడ్, ఇప్పుడు బిగ్ థ్రిల్లింగ్ తో వస్తుంది...

First Published | Oct 10, 2023, 11:39 AM IST

చాట్‌లాక్ తర్వాత మరిన్ని ప్రైవసీ ఫీచర్‌లతో సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యం లోని వాట్సాప్‌ వచ్చేస్తోంది. నివేదికల ప్రకారం, WhatsApp చాట్‌లను సేఫ్ గా ఉంచడానికి కంపెనీ కొత్త  సిక్రెట్  కోడ్‌ను పరీక్షిస్తోంది. దీని ద్వారా  యూజర్లు  సేఫ్ చాట్  కోసం   పాస్‌వర్డ్‌  పెట్టుకోవడానికి  సహాయపడుతుంది. ఈ ఫీచర్ త్వరలో వాట్సాప్ బీటాలో అందుబాటులోకి రానుంది.
 

Wabetinfo నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రావచ్చు. ఈ ఫీచర్ సెన్సిటివ్  చాట్ కి మరింత భద్రతను అందిస్తుంది. యాప్ సెర్చ్  బార్ నుండి లాక్ చేసిన వారి చాట్‌లను యాక్సెస్ చేయడానికి యూజర్లు  ముందుగా సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
 

సీక్రెట్ కోడ్‌ను కాన్ఫిగర్ చేయడం వలన యూజర్లు  డివైజ్  నుండి చాట్‌లను లాక్ చేయడంలో సహాయపడుతుంది. ఫాస్ట్ యాక్సెస్ కోసం ఒక పదం లేదా సాధారణ ఎమోజీని ఉపయోగించవచ్చని  WhatsApp సూచిస్తుంది. యూజర్లు ఏ సమయంలోనైనా సీక్రెట్  కోడ్‌ని మార్చవచ్చు లేదా తీసివేయవచ్చు. కొద్దీ నెలల క్రితం WhatsApp చాట్ లాక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, ఇంకా వినియోగదారులు   ఫింగర్ ప్రింట్, ఫేస్‌లాక్ లేదా పాస్‌కోడ్‌ ఉపయోగించి చాట్‌లను లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
 


ఈ ఫీచర్ Android అండ్  iOS వినియోగదారుల కోసం పరిచయం చేయబడింది, దీని ద్వారా  వారి మెసేజెస్ ప్రైవేట్‌గా ఇంకా సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. పాస్‌కోడ్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్ అప్షన్స్ తో లాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ చాట్  ప్రైవసీ నిర్ధారించడానికి లాక్ చేయబడిన చాట్ థ్రెడ్‌లను మరొక ఫోల్డర్‌కు తరలిస్తుంది.

 మీ అనుమతి లేకుండా  ఫోన్‌ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే ముందుగా చాట్‌ను క్లియర్ చేయమని యాప్ అడుగుతుంది.  ఇంకా  ప్రయత్నిస్తున్న వ్యక్తి ముందు క్లియర్ విండో తెరవబడుతుంది. లాక్ చాట్ ఫీచర్ లాక్ చేయబడిన చాట్‌లో పంపిన ఫోటోలు ఇంకా వీడియోలు ఫోన్ గ్యాలరీకి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయకుండా చూసుకుంటుంది.

Latest Videos

click me!