స్మార్ట్ ట్రాకింగ్ ఫీచర్...
ఈ కెమెరాలో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. ఇంట్లో ఎవరు కదలినా ఈ కెమెరా ఆటోమేటిక్ గా వాళ్లను ఫాలో అవుతుంది. దీనినే స్మార్ట్ ట్రాకింగ్ అంటారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఇంట్లోకి వచ్చినా.. మనం ఈజీగా ఈ కెమెరా సహాయంతో గుర్తించొచ్చు.
ఎక్కడ ఉన్నా.. కెమెరాలో చూస్తూ మాట్లాడొచ్చు..
ఈ కెమెరాలో Two-Way Audio సపోర్ట్ కూడా ఉంది. మనం బయట ఎక్కడ ఉన్నా కూడా మన మొబైల్ ద్వారా ఇంట్లో ఉన్నవారితో మాట్లాడవచ్చు. ఇంట్లో ఉన్నవారి దగ్గర ఫోన్ లేకపోయినా మనం వారిని చూస్తూ వారితో ఈజీగా మాట్లాడొచ్చు.
మెమరీ కార్డ్ & క్లౌడ్ స్టోరేజ్
రికార్డింగ్ కోసం మెమరీ కార్డ్ ఉపయోగించవచ్చు. అలాగే క్లౌడ్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో వీడియోలు సేఫ్‌గా స్టోర్ అవుతాయి.
Alexa సపోర్ట్
ఈ కెమెరా Alexaతో కూడా పనిచేస్తుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా కెమెరాను కంట్రోల్ చేయొచ్చు.
ధర ఎంతంటే...
ఇన్ని స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి కాబట్టి... దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది అని మరు అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే.. దీని ధర చాలా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుంది. కేవలం రూ.1800 రూపాయలతో మనం దీనిని కొనుగోలు చేయచ్చు. ఇంటి భద్రత కోసం తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు కావాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఎంపిక అని చెప్పొచ్చు.
తక్కువ ధరలో స్మార్ట్ ఫీచర్లు, మొబైల్ కనెక్టివిటీ, నైట్ విజన్, 360 డిగ్రీల వ్యూ వంటి ఫీచర్లతో ఈ Wi-Fi CCTV కెమెరా కు డిమాండ్ పెరిగిపోతుంది.