స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జి vs వన్ ప్లస్ 9ఆర్‌టి: ధర నుండి ఫీచర్ల వరకు ఏ ఫోన్ నిజంగా బెస్ట్..

First Published Jan 17, 2022, 3:49 PM IST

సౌత్ కొరియన్ మల్టీషనల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం స్యామ్సంగ్  గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జి స్మార్ట్‌ఫోన్‌తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది  అంటే ఈ సంవత్సరం లాంచ్ అయిన కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. దీనిలో 30ఎక్స్ జూమ్ ఇచ్చారు. అంతేకాకుండా, స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ భారతీయ మార్కెట్లో Exynos ప్రాసెసర్‌తో పరిచయం చేశారు. 

 మరోవైపు చైనీస్ కంపెనీ వన్ ప్లస్ భారతీయ మార్కెట్లో వన్ ప్లస్ 9ఆర్‌టితో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. వన్ ప్లస్ 9ఆర్‌టిలో కూడా 5జి సపోర్ట్ ఇచ్చారు. స్యామ్సంగ్ ఎస్21 ఎఫ్‌ఈ 5జి ప్రారంభ ధర రూ. 49,999 కాగా, వన్ ప్లస్ 9ఆర్‌టి ప్రారంభ ధర రూ. 42,999. ఈ రెండు ఫోన్‌లు దాదాపు ఒకే ధర విభాగంలో ఉన్నాయి. మీలో చాలా మంది ఈ రేంజ్ ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తే ఈ  జాబితాలో ఈ రెండు ఫోన్‌లు కూడా ఉంటాయి. అయితే ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్ అనేది ప్రశ్న. అయితే వీటి ధర నుండి ఫీచర్ల వరకు ప్రతిదీ తెలుసుకుందాం...

ధర

గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జి 8 జి‌బి ర్యామ్‌  128జి‌బి స్టోరేజ్‌ని రూ. 49,999కి కొనుగోలు చేయవచ్చు. 256జి‌బి స్టోరేజ్ వేరియంట్‌తో 8జి‌బి ర్యామ్ ని రూ. 53,999కి కొనుగోలు చేయవచ్చు.

వన్ ప్లస్ 9ఆర్‌టి 8జి‌బి ర్యామ్‌తో 128జి‌బి స్టోరేజ్ ధర రూ. 42,999 కాగా, 12జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్ ధర రూ. 46,999గా నిర్ణయించారు.

స్పెసిఫికేషన్‌లు
వన్ ప్లస్ 9ఆర్‌టి 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.62-అంగుళాల పూర్తి HD+ Samsung E4 AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. డిస్ ప్లే బ్రైట్ నెస్ 120Hz. అంతేకాకుండా HDR10+ సపోర్ట్ అందించారు. వన్ ప్లస్ 9ఆర్‌టి ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ OS 11 లభిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో 12జి‌బి LPDDR5 ర్యామ్, 256జి‌బి UFS 3.1 స్టోరేజ్‌ ఉంది. ఫోన్‌లో స్పేస్ కూలింగ్ టెక్నాలజీని అందించారు.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ UI 4 గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జిలో ఇచ్చారు. అంతేకాకుండా 6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ ప్లే కలిగి ఉంది, అంటే 120Hz రిఫ్రెష్ రేటు లభిస్తుంది. ఫోన్ గరిష్టంగా 8జి‌బి LPDDR5 RAMతో 256జి‌బి వరకు స్టోరేజ్ పొందుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది.

 కెమెరా
ఈ స్యామ్సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, మొదటి లెన్స్ 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్. మరోవైపు, రెండవ లెన్స్ 12 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్, దీనితో 30x ఆప్టికల్ జూమ్ ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇంకా 4కె రికార్డింగ్ సౌకర్యం ఇచ్చారు.

వన్ ప్లస్ 9ఆర్‌టికి కూడా మూడు బ్యాక్ కెమెరాలను  ఇచ్చారు, వీటిలో ప్రైమరీ లెన్స్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ దీని ఎపర్చరు f/1.8. దీనితో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ కెమెరాతో 4కె రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంది. ఫోన్‌లోని రెండవ లెన్స్ 16 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ అండ్ మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ
వన్ ప్లస్ 9ఆర్‌టి 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ కోసం టైప్-సి పోర్ట్, 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2 ఇచ్చారు. ఈ వన్ ప్లస్ ఫోన్‌కు ఐ‌పి రేటింగ్ ఇవ్వలేదు, చెప్పాలంటే ఇది పెద్ద లోపం.

ఈ స్యామ్సంగ్ ఫోన్ ని 4500mAh బ్యాటరీతో 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా వైర్‌లెస్ పవర్‌షేర్‌తో కూడా వస్తుంది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 5G, 4G, స్యామ్సంగ్ పే, ఎన్‌ఎఫ్‌సి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఫోన్ IP68 రేటింగ్ పొందింది.

click me!