టాబ్లెట్ మార్కెట్‌లో ఆపిల్‌ను అధిగమించిన సామ్‌సంగ్.. ఇప్పుడు 40 శాతం వాటాతో మార్కెట్ రారాజు..

First Published | Jun 1, 2022, 7:25 PM IST

సామ్‌సంగ్ 2022 మొదటి త్రైమాసికంలో టాబ్లెట్ మార్కెట్లో ఆపిల్‌ను అధిగమించింది. ఇప్పుడు టాబ్లెట్ మార్కెట్‌లో సామ్‌సంగ్ మార్కెట్ వాటా 40 శాతంగా ఉంది. నివేదిక ప్రకారం, సామ్‌సంగ్ పనితీరు పరంగా ఆపిల్  ఐప్యాడ్‌ను కూడా దాటేసింది. దీంతో కంపెనీ  Samsung Galaxy Tab A8 సిరీస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాబ్లెట్‌గా మారింది.
 

IDC నివేదిక ప్రకారం, ఇప్పుడు టాబ్లెట్ మార్కెట్‌లో కొత్త రాజు Samsung. సామ్‌సంగ్ టాబ్లెట్ మార్కెట్లో 40 శాతం వాటా ఉంది అలాగే ఈ త్రైమాసికంలో 10 శాతం వృద్ధిని సాధిస్తోంది. 2022 మొదటి త్రైమాసికంలో, Samsung Galaxy Tab A8 భారతదేశంలో అత్యధికంగా విక్రయించబడింది, ఆ తర్వాత Samsung Galaxy Tab S8ని ప్రజలు అత్యధికంగా కొనుగోలు చేశారు.

సామ్‌సంగ్ ఇండియాలోని  న్యూ కంప్యూటింగ్ బిజినెస్  హెడ్ సందీప్ పోస్వాల్ ఈ అచీవ్‌మెంట్ గురించి మాట్లాడుతూ, “ఇటీవల లాంచ్ అయిన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్ అండ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 సిరీస్ జనాదరణ వల్ల ట్యాబ్లెట్ మార్కెట్‌లో మా నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు వీలు కల్పించింది. Galaxy Tab S8 సిరీస్ విజయం, ముఖ్యంగా Galaxy Tab S8 Ultra, వినియోగదారులు అటువంటి ఆవిష్కరణలకు విలువనిచ్చే విధానానికి ఇంకా రోజువారీ పనులను సమర్థవంతంగా నిర్వహించే విధానానికి నిదర్శనం.
 

Latest Videos


సాధారణంగా భారతీయ మార్కెట్‌లో ఆపిల్ ట్యాబ్లెట్‌పై ఆధిపత్యం చెలాయించేది, కానీ ఈసారి  మారింది. యాపిల్ ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సిరీస్ టాబ్లెట్‌లు భారత మార్కెట్‌లో ఉన్నాయి.

click me!