Jio Unlimited Data : జియో బంపరాఫర్.. కేవలం రూ.50 కే 28 రోజులు అన్‌లిమిటెడ్ డేటా

Published : Nov 24, 2026, 03:33 PM IST

రాత్రి పూట ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవాళ్లకు రిలయన్స్ జియో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.50 తో తెల్లవార్లూ అన్‌లిమిటెడ్ డేటా ఎంజాయ్ చేసేలా కొత్త ప్లాన్ తెచ్చింది.

PREV
14
ఏమిటీ జియో రూ.50 రీఛార్జ్ ప్లాన్?

ఇండియాలో టాప్ టెలికాం కంపెనీ ఏదంటే టక్కున రిలయన్స్ జియో పేరు వినిపిస్తుంది. సరసమైన ధరలకే టెలికాం సేవలు అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది ఈ ప్రైవేట్ టెలికాాం సంస్థ. ఎప్పటిలాగే తమ కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్స్ తెచ్చింది.

ఈ న్యూ ఇయర్ కానుకగా కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది రిలయన్స్ జియో. కేవలం రూ.50 తో కూడిన కొత్త డేటా ప్లాన్ ప్రకటించింది. నవంబర్ 26, 2026 నుంచి ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువగా నెట్ వాడేవాళ్ల కోసమే ఈ స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చింది జియో.

24
రూ.50 జియో ప్లాన్‌లో లాభాలు ఏంటి?

జియో తెచ్చిన ఈ రూ.50 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ మెయిన్ హైలైట్ ఏంటంటే.. అన్‌లిమిటెడ్ నైట్ డేటా. ఈ ప్లాన్ తో రోజూ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. రాత్రిళ్లు సినిమాలు చూడటం, పెద్ద పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోవడం లాంటివి ఇక చాలా ఈజీ.

ప్లాన్ డీటెయిల్స్ ఇవే

• రీఛార్జ్ ధర : రూ.50

• వాలిడిటీ : 28 రోజులు

• డేటా బెనిఫిట్ : అన్‌లిమిటెడ్ నైట్ డేటా

• టైమింగ్స్ : రోజూ రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు

• నెట్‌వర్క్ : 4G, 5G

• స్పీడ్ లిమిట్ : ఐదు గంటల్లో ఎంత డేటా వాడినా స్పీడ్ తగ్గించబోమని కంపెనీ తెలిపింది.

34
పగటి పూట డేటా ఏమవుతుంది?

ఈ ప్లాన్ లో ఇంకో మంచి విషయం ఏంటంటే.. రాత్రి వాడే డేటాని మీ రెగ్యులర్ ప్లాన్ లోని డేటా నుంచి కట్ చేయరు. అంటే రోజంతా వేరే డేటా వాడుకోవచ్చు… రాత్రి మాత్రమే ఈ ప్లాన్ డేటా వినియోగించబడుతుంది. పగలు మీకు వచ్చే డేటాని సేవ్ చేసుకుంటూనే, రాత్రి పూట ఎక్స్‌ట్రా ఇంటర్నెట్ వాడుకోవచ్చు.అంతేకాదు ఈ డేటా డౌన్‌లోడ్‌కి ఎలాంటి లిమిట్ లేదు. స్పీడ్ కూడా అస్సలు తగ్గదని జియో చెబుతోంది.

4G, 5G రెండింటిలోనూ అన్‌లిమిటెడ్ డేటా

ఈ రూ.50 ప్లాన్ 4G, 5G రెండు నెట్‌వర్క్‌లలో పనిచేస్తుంది. 4G నెట్‌వర్క్ ఉన్నవాళ్లు, 5G కవరేజ్ ఉన్నవాళ్లు ఇద్దరూ ఈ ఆఫర్‌ని ఎంజాయ్ చేయొచ్చు.

ఇప్పటికే జియోలో 5G ఎక్స్‌ట్రా డేటా ఆఫర్స్ ఉన్నాయి. రూ.15 ప్లాన్‌ తో ఒక రోజు వాలిడిటీ వస్తుంది. ఇంకో రూ.25 ప్లాన్ కూడా ఉంది… కానీ అది ఇంకా అందరికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు.

44
ఈ ప్లాన్ ఎవరికి యూజ్ అవుతుంది?

జియో రూ.50 ప్లాన్ రాత్రి సమయంలో ఇంటర్నెట్ తో కుస్తీ పట్టేవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. యువతీయువకులు ఎక్కువగా దీన్ని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి.

• నైట్ డ్యూటీలు చేసేవాళ్లకు.

• కాలేజీ స్టూడెంట్స్‌కి.

• ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్లకు.

• రాత్రి పూట సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లకు.

• పెద్ద పెద్ద ఫైల్స్, వీడియోలు డౌన్‌లోడ్ చేసేవాళ్లకు.

ఎప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు?

ఈ కొత్త రూ.50 ప్లాన్ నవంబర్ 26, 2026 నుంచి అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఆన్‌లైన్ లో అయినా, ఆఫ్‌లైన్ లో అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ ఈ అన్‌లిమిటెడ్ డేటా రూల్స్, కండిషన్స్ మీద జియో అఫీషియల్ గా ఇచ్చే క్లారిటీ కోసం వెయిట్ చేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories