ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా అమర్చారు. ఇది 8K వీడియోను 30 ఫ్రేమ్‌ల రేట్‌తో, అలాగే 4K వీడియోను 120fps వరకూ రికార్డ్ చేయగలదు. అలాగే, Dolby Vision ఫీచర్‌కి మద్దతు ఉంది కానీ ఇది 4K లేదా 1080p రిజల్యూషన్‌లో మాత్రమే పనిచేస్తుంది, అది కూడా గరిష్ఠంగా 60fps వరకు. తక్కువ వెలుతురు ఉన్న చోట్లను దృష్టిలో పెట్టుకుని, ప్రత్యేకమైన AI నైట్ విజన్ మోడ్‌ని అందించారు. ఇది చీకటి వాతావరణాల్లోనూ స్పష్టమైన ఫోటోలు తీయటానికి సహాయపడుతుంది.
కెమెరా ఫీచర్లలో మరొక విశేషం, AI ఆధారిత గ్లేర్ రిమూవల్ టెక్నాలజీ. దీని ద్వారా ఫోటోలలో కనిపించే అద్దంలో ప్రతిబింబాలు లేదా వెలుతురుపై ప్రతిచాయల్ని తగ్గించవచ్చు. అలాగే, ల్యాండ్‌స్కేప్ ఫోటోలు తీసేటప్పుడు AI ల్యాండ్‌స్కేప్+ మోడ్ ఉపయోగించి విజువల్ క్వాలిటీ, డిటైల్స్‌ను మెరుగుపరచవచ్చు.
ఈ ఫోన్ మరో ఆసక్తికరమైన ఫీచర్‌తో వచ్చింది — 4K అండర్ వాటర్ వీడియో మోడ్. కంపెనీ తెలిపిన ప్రకారం, ఇది నీటి అడుగున కూడా అల్ట్రా హెచ్‌డీ వీడియో క్వాలిటీని అందించగలదు, ఇది సముద్రపు అడుగున, స్విమ్మింగ్ పూల్‌లో వీడియోలు తీయాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.