ఇందులో వ్యాక్సిన్ పొందిన తరువాత ఒక మొబైల్ నంబర్ నుండి ఫీడ్‌బ్యాక్ కాల్ వస్తుంది అని ఉంది. ఈ మెసేజ్ గురించి మైగోవ్ (my.gov) ప్రజలను హెచ్చరించింది. మైగోవ్ వెబ్‌సైట్‌లోని మిత్-బస్టర్స్ అని పిలువబడే ఒక విభాగం దీనిని పై హెచ్చరించింది.
undefined
అయితే ఈ విభాగంలో ప్రభుత్వం నకిలీ వాదనలు, పుకార్ల గురించి ప్రజలకు తెలియజేస్తుంది. ఈ విభాగంలో వ్యాక్సిన్ పొందిన తరువాత ఫీడ్‌బ్యాక్ సంబంధించిన కాల్స్ గురించి కూడా ఉంది. మైగోవ్ మిత్-బస్టర్స్ లో ప్రజల నుండి ఫీడ్‌బ్యాక్ ప్రభుత్వం కాల్స్ చేయదని తెలిపింది.
undefined
ఈ మెసేజులో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత, ప్రభుత్వం నుండి ఫీడ్‌బ్యాక్ కోసం + 91-2250041114 నంబర్ నుండి కాల్ వస్తుంది అని ఉంది. అయితే అలాంటి కాల్స్ మోసపోరితమైనవి కావొచ్చు అని ప్రభుత్వం తెలిపింది. కాబట్టి అలాంటి కాల్స్ నుండి దూరంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని సూచించింది.
undefined
కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకండిహోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న సైబర్ దోస్త్ అనే సంస్థ ట్వీట్ ద్వారా దీని గురించి ప్రజలను హెచ్చరించింది. కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లో పేరు, వయస్సు, లింగం, తదుపరి డోస్ తేదీతో సహా ఇతర సమాచారం ఉంటుందని సైబర్ దోస్త్ ట్వీట్ చేసింది.
undefined
ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మిమ్మల్ని మోసం చేయడానికి మీ సమాచారాన్ని సైబర్ దుండగులు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు అని తెలిపింది.
undefined