బుగట్టి మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌.. చేతితో తయారు చేసిన ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

First Published May 31, 2021, 2:45 PM IST

మీరు స్పొర్ట్స్ కార్ బ్రాండ్  బుగట్టి కార్ల గురించి చాలా వినే ఉంటారు. కానీ మీరు ఇప్పుడు బుగట్టి స్మార్ట్ వాచ్ ధరించి బుగట్టి కారులో ప్రయాణించవచ్చు. అవును.. నిజమే.. నేడు బుగట్టి దాని మొదటి స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది చేతితో తయారు చేసిన స్మార్ట్‌వాచ్. 

బుగాట్టి సిరామిక్ ఎడిషన్ వన్ పుర్ స్పోర్ట్, బుగట్టి సిరామిక్ ఎడిషన్ వన్ లే నోయిర్, బుగట్టి సిరామిక్ ఎడిషన్ వన్ డివోలతో సహా మొత్తం మూడు మోడళ్ల స్మార్ట్‌వాచ్‌లను కంపెనీ ఏకకాలంలో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఈ రోజుల్లో ఉపయోగపడే జిపిఎస్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
undefined
బుగట్టి స్మార్ట్ వాచ్ స్పెకిఫికేషన్లుమొదట చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ వాచీలన్నీటిని చేతితో తయారు చేయబడ్డాయి. వీటిని ఐటి అండ్ వాచ్ నిపుణుల బృందం రూపొందించారు. ఈ వాచ్ లో సుమారు 1,000 వేర్వేరు భాగాలు ఉపయోగించారు. ఈ స్మార్ట్ వాచ్ లో హైపర్ స్పోర్ట్స్ కార్లలో ఉపయోగించిన ఇంజనీరింగ్‌ను ఉపయోగించినట్లు బుగట్టి పేర్కొంది. స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేసే వారికి దీన్ని కస్టమైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ వాచ్ రబ్బరు బెల్ట్, టైటానియం బెల్ట్ తో వస్తుంది.
undefined
బుగట్టి స్మార్ట్‌వాట్‌లో జీపీఎస్ సెన్సార్ ఉంది. అంతేకాకుండా హార్ట్ రేట్ మానిటర్ తో స్ట్రెస్ లెవెల్, బ్లడ్ ఆక్సిజన్‌ను కొలిచే ఫీచర్ కూడా ఉంటుంది. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో 445 ఎంఏహెచ్ బ్యాటరీని దీనిలో లభిస్తుంది. 390x390 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో రౌండ్ ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లేను ఉంది. అలాగే ఈ వాచ్‌కు ఐదేళ్ల వారంటీ లభిస్తుంది. ఇంకా 90 కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్ వాటర్ రిసిస్టంట్ కోసం 10 ఎటిఎం రేటింగ్ చేయబడింది. దీన్ని బుగట్టి డాష్‌బోర్డ్ యాప్ నుండి కంట్రోల్ చేయవచ్చు.
undefined
click me!