అద్భుతమైన పనితీరు, డ్యూరబిలిటీ కలిగిన ఫోన్ల విషయంలో ధరను దృష్టిలో ఉంచుకునే భారతీయ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు కాస్త తక్కువతో సరిపెట్టుకుంటారు. ఎక్కువసేపు మంచి పనితీరు, ఎక్కువ రోజులు మన్నిక, చూపు తిప్పుకోనివ్వని డిజైన్ కలిగిన ఫోన్‌ను చౌక ధరలో కొనాలంటే అంత ఈజీ కాదు.
భారతదేశంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటైన OPPO (ఒప్పో).. ఇటీవల కొత్త OPPO K12x 5G ని పరిచయం చేసింది. సూపర్ టఫ్ బాడీ, లాంగ్ లైఫ్ బ్యాటరీ, సొగసైన డిజైన్, పలు ప్రీమియం సాంకేతిక ఫీచర్లతో కలిపి OPPO K12x 5G INR రూ.15 వేల కన్నా తక్కువ ధరల విభాగంలో సరైన ఎంపికగా కనిపిస్తోంది. ఇది స్లిమ్‌గా ఉండి, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో 360° డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీని కలిగి ఉంది. 5,100mAh బ్యాటరీ, నాలుగేళ్ల దీర్ఘకాలికత, స్ప్లాష్ టచ్, AI లింక్ బూస్ట్ 120Hz అద్భుతమైన డిస్ప్లే లాంటి నవీకరణలను రూ.15,000 కన్నా తక్కువ ధరలో అందిస్తోంది.
అల్ట్రా-స్లిమ్, స్టైలిష్ డిజైన్
ఒప్పో ప్రత్యేకమైన శైలి, గ్రేస్, ఎలిగెన్స్ ని కలగలిపిన పనిరకరం OPPO (ఒప్పో) K12x 5G. ఇది 7.68 mm స్లిమ్ గా, 186g మాత్రమే బరువు కలిగి ఉంది. ఇది ఉత్తమ తేలికపాటి పరికరాల్లో ఒకటిగా చేస్తుంది. మిడిల్ బెజెల్ చుట్టూ అద్భుతమైన మ్యాట్ ఫినిష్‌తో లుక్స్ మరింత మెరుగుపరిచారు. ఇది కేవలం శైలిని మాత్రమే కాకుండా స్మూత్ , సౌకర్యవంతమైన గ్రిప్‌ని కూడా అందిస్తుంది. గార్జియస్ సర్క్యులర్ కెమెరా ప్లాట్ఫామ్తో కూడిన స్లీక్, మినిమలిస్టిక్ డిజైన్ అనుకున్నలక్ష్యాన్ని సాధిస్తుంది.
ఫోన్ రెండు శైలుల్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కటి విభిన్న రంగును ప్రతిబింబిస్తుంది. మిడ్ నైట్ వైలెట్ ఒక చీకటి ఊదా టోన్లతో మెరుస్తున్న చుక్కలతో నిండిన రాత్రిని గుర్తు చేస్తుంది. OPPO Glow డిజైన్‌ను కలిగి ఉంది. ఇది గీతలు, వేలిముద్రలను నిరోధించే సున్నితమైన ఫ్రాస్టెడ్ టెక్స్చర్‌ని అందిస్తుంది. బ్రీజ్ బ్లూ రంగు.. ఒప్పో సిగ్నేచర్ మ్యాగ్నెటిక్ పార్టికల్ డిజైన్‌ని కలిగి ఉంది. ఇది ప్రశాంత నీలి ఆకాశంలో ల్యాండ్ స్కేప్‌లను పోలి ఉంటుంది.
ఇండస్ట్రీ- లీడింగ్ డ్యూరబిలిటీ ఫీచర్స్
OPPO (ఒప్పో) తమ స్మార్ట్ ఫోన్ల డ్యూరబిలిటీ పరిమితులను పర్ఫెక్ట్‌గా చేస్తోంది. ఒప్పో K12x 5G దానికి మినహాయింపు కాదు. ఇది నిర్మాణ నాణ్యత, బ్యాటరీలో బలమైన ఫలితాలను అందించే ఆల్-అరౌండ్ డ్యూరబుల్ ఛాంపియన్. 360° డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీ .. స్లిమ్ అయినప్పటికీ ఇంప్రెసివ్ 7.68 mm ఫార్మ్ ఫ్యాక్టర్‌లో కింద పడిపోవడం, గాట్లు పడటం వంటి వాటి నుంచి రక్షిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో స్వతంత్రంగా అభివృద్ధి చేసిన హై-స్ట్రెంగ్త్ అలాయ్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. రెండు సార్లు బలోపేతం చేసిన Panda గ్లాస్‌తో తయారు చేసిన డబుల్-టెంపరింగ్ గ్లాస్ మెరుగైన పంక్చర్ రెసిస్టెన్స్‌ని అందిస్తుంది. క్లెవర్ డిజైన్ స్పాంజ్ బయోనిక్ కుషనింగ్‌ని అనుసరిస్తుంది. ఇది ప్రతి భాగానికి తగినంత ఖాళీని వదిలివేయడం ద్వారా ఫోన్ పడిపోవడాన్ని, గాట్లు పడటాన్ని నిరోధించేలా చేస్తుంది. అదనంగా, అన్ని కీలక భాగాలు షాక్-అబ్జార్బింగ్ ఫోమ్‌తో అమర్చి ఉన్నాయి.
OPPO (ఒప్పో) నిర్వహించిన పరీక్షల్లో స్మార్ట్ ఫోన్ కఠినమైన డ్రాప్, ఇంపాక్ట్, ప్రెజర్ టెస్టుల్లో ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ని అధిగమించింది. ఇది రోజువారీ సవాళ్ల కోసం కచ్చితంగా పని చేస్తుంది. ఇది మిలిటరీ స్టాండర్డ్ MIL-STD-810H సర్టిఫైడ్ డ్యూరబిలిటీని కలిగి ఉంది. ఈ ధర పరిధిలో అత్యంత దృఢమైన ఫోన్ ఇదే. OPPO (ఒప్పో) K12x 5G మూలలో కుషనింగ్, అదనపు షాక్ అబ్జార్బింగ్ కోసం బలోపేతం చేసిన వెనుక షెల్‌తో ప్రత్యేకమైన యాంటీ- డ్రాప్ షీల్డ్ కేసును కలిగి ఉంది. ఒప్పో రోలింగ్ డ్రమ్ టెస్టులలో, ఈ ప్రత్యేకమైన కేసు 200% ఎక్కువ రక్షణను అందించింది.
మొట్టమొదటిసారిగా, ఒప్పో తన ఇండస్ట్రీ-లీడింగ్ స్ప్లాష్ టచ్ను OPPO K12x 5Gలో పరిచయం చేసింది. ఈ ధర పరిధిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లో ఈ అధునాతన ఫీచర్ కలిగి ఉండడం అదనపు బోనస్. టచ్ చిప్‌లో ఉన్న అధునాతన టచ్ డిటెక్షన్ ఆల్గోరిథమ్ కచ్చితత్వం, స్పందనను మెరుగుపరుస్తుంది. వాడుకదారులు తడి లేదా చెమట పట్టిన చేతులతో సులభంగా ఫోన్‌తో అంతరాయం లేకుండా చాట్ చేయొచ్చు.
సూపర్-ఫాస్ట్ చార్జింగ్ తో లాంగ్ లైఫ్ బ్యాటరీ
OPPO (ఒప్పో) K12x 5Gలో ఉన్న బ్యాటరీని హైపర్- ఎనర్జీ బ్యాటరీగా వివరించవచ్చు. ఎక్కువ సేపు చార్జింగ్, ఎక్కువ రోజుల మన్నికను కలిగి ఉంది. 5,100mAh పెద్ద బ్యాటరీ నాలుగేళ్లకు పైగా ఉంటుంది . 45W SUPERVOOC™ ఫ్లాష్ చార్జ్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో 20% 74 నిమిషాల్లో 100 శాతం చార్జ్ అయిపోతుంది. స్క్రీన్ ఆఫ్ ఉన్నప్పుడు 335 గంటల పాటు ఆన్ లోనే ఉంటూ ఫోన్ కాల్స్ అందిస్తుంది. వీడియో స్ట్రీమింగ్ అభిమానుల కోసం, ఈ స్మార్ట్ పరికరం సులభంగా 15.77 గంటల YouTube వీడియో ప్లేబ్యాక్‌ని అందిస్తుంది. మీరు కూడా 9.31 గంటల ఆడియో ప్లేబ్యాక్‌తో మీ ప్లేలిస్టులను ఆస్వాదించవచ్చు. ఈ రోజువారీ సూపర్ హీరో బ్యాటరీ 1,600 ఛార్జ్ సైకిళ్ల తర్వాత కూడా దాని అసలు సామర్థ్యంలో 80% ని స్థిరంగా నిలుపుకుంటుంది.
అన్ని పరిస్థితుల్లోనూ స్పష్టమైన విజువల్స్
OPPO (ఒప్పో) K12x 5Gలోని డిస్ప్లే స్పష్టత కోసం తయారు చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ అల్ట్రా బ్రైట్ డిస్ప్లే 6.67" పరిమాణంలో, 89.9% స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. సగటు బ్రైట్నెస్ 850 నిట్స్ , పీక్ బ్రైట్నెస్ 1000 నిట్స్‌తో, ఇది ప్రతిసారీ మృదువుగా, అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. మీరు బయట ప్రకాశవంతమైన చోట ఫోన్ ఉపయోగిస్తున్నా లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీ ఇష్టమైన కంటెంట్‌లో మునిగిపోతున్నా.. వాల్యూమ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా వాల్యూమ్‌ని 300% పెంచే అల్ట్రా వాల్యూమ్ మోడ్‌తో ఎంటర్టైన్మెంట్ స్థాయి మరింత మెరుగుపడింది.
తక్కువ పవర్ వినియోగంతో అద్భుతమైన పనితీరు
ఒప్పో K12x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ ఉంది. తక్కువ పవర్ వినియోగంతో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. పరికరం 6GB RAM + 128GB ROM లేదా 8GB RAM + 256GB ROM తో అందుబాటులో ఉంది. UFS 2.2 స్టోరేజ్, నిర్దాక్షిణ్యమైన వేగంతో అనేక పనులను సులభంగా నిర్వహించడానికి విస్తారమైన స్టోరేజీ అందిస్తుంది. OPPO RAM ఎక్స్పాంషన్ ఫీచర్ ఉచిత ROMలో 8GB వరకు తాత్కాలిక RAMగా మారుస్తుంది. పరికరం 1 TB వరకు SD కార్డ్ విస్తరణను కూడా అందిస్తుంది. ఇది Android 14 ఆధారంగా ColorOS 14 పై నడుస్తుంది.
AI LinkBoostతో పోటీని అధిగమించండి
ఒప్పో AI లింక్బూస్ట్ టెక్నాలజీతో OPPO K12x 5G నిరంతర కనెక్షన్‌ని అందిస్తుంది. AI లింక్‌బూస్ట్ అనేది పూర్తి-లింక్ నెట్వర్క్ డేటా ట్రాన్స్మిషన్ ఇంజిన్, అధ్వాన సిగ్నల్, బిజీ నెట్వర్క్‌లు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు బలమైన కనెక్షన్‌ని నిర్ధారిస్తుంది. షాపింగ్ మాల్స్ లేదా బేస్మెంట్ వంటి బిజీ ప్రాంతాల్లో, AI లింక్‌బూస్ట్ OPPO K12x 5G ని Wi-Fi , సెల్యులర్ నెట్వర్క్‌ల మధ్య 20% వేగంగా మారేందుకు సహాయపడుతుంది. అదనంగా, DSDA డ్యూయల్-కార్డ్ డ్యూయల్-స్టాండ్‌బైతో, మీరు రెండు సిమ్ కార్డులలో కాల్స్, ఇంటర్నెట్‌ని ఒకేసారి బ్రౌజ్ చేయవచ్చు.
AI లింక్‌బూస్ట్ నెట్వర్క్‌లలో కంటెంట్‌ని వేగంగా షేర్ చేయడానికి, ట్రాఫిక్‌లో లేదా నగర కేంద్రాల్లో కచ్చితమైన లొకేషన్ అప్ డేట్ పొందడానికి సహాయపడుతుంది. ఈ పరికరం మెరుగైన పనితీరు ను ఎక్కువ రోజులు అందిస్తుంది. ఇది 50 నెలల ఫ్లూయెన్సీ టెస్ట్‌ని కూడా పాస్ అయిందింది. ఎక్కవ రోజులు వాడినా డివైస్ పనితీరులో తేడా రాదు.
AI శక్తి తో పొట్రైట్స్
ఈ ఫోన్ 32MP AI డ్యూయల్ కెమెరా, 2MP పోర్ట్రేట్ కెమెరా , 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది, AI శక్తిని వినియోగించి పిక్చర్-పర్ఫెక్ట్ పోర్ట్రెయిట్లను అందిస్తుంది. 32MP అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా, కాంతివంతమైన సూర్యకాంతిలో కూడా స్పష్టమైన, అద్భుతమైన హై-రిజల్యూషన్ ఫోటోలను చిత్రీకరిస్తుంది. ఇది OPPO HDR 3.0 ఆల్గోరిథమ్‌తో లోడ్ చేసి ఉంది. ఇది మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా ఫోటోలు తీసుకోవడానికి అవసరమైనప్పుడు కచ్చితమైన చిత్రాలను అందిస్తుంది.
పోర్ట్రేట్ మోడ్ మెయిన్ కెమెరా, 2MP పోర్ట్రేట్ కెమెరా శక్తిని కలిపి చిత్రంలో డెప్త్ ని గుర్తించి, మెయిన్ ఆబ్జెక్ట్ దాని చుట్టూ ఉన్న వాటిని వేరు చేస్తుంది. ఇది ప్రతి చిత్రంలో మీరు ప్రధానమైన అంశం అవ్వడానికి అద్భుతమైన డెప్త్- ఆఫ్- ఫీల్డ్ ప్రభావాన్ని జోడిస్తుంది.
AI పోర్ట్రైట్ రిటచింగ్ AI సహాయంతో ఫోటోలను రీ- టచింగ్ చేస్తుంది. ఈ ఫోన్‌తో సరిగ్గా ఎనిమిది ముఖ వివరాలను సవరించి అందమైన సెల్ఫీలు, పోర్ట్రెయిట్లు, వీడియోలను రీటచ్ చేస్తుంది. AI వెనుక కెమెరాపై తీసిన షాట్లను కూడా రిటచ్ చేయవచ్చు. ఈ పరికరానికి ప్రత్యేకమైన ఫీచర్ అయిన డ్యూయల్-వ్యూ వీడియోతో ముందరి, వెనుక కెమెరాల నుండి ఒకేసారి వీడియోలను రికార్డు చేసి మరింత ఆకర్షణీయమైన , పర్సనలైజ్డ్ వీడియో కంటెంట్‌ని సృష్టించవచ్చు.
గొప్ప ఎంపిక
OPPO K12x 5G అనేక పాత్రలను ధరించిందని చెప్పాలి. దాని స్లీక్, స్లిమ్, మినిమలిస్టిక్ 360° డ్యామేజ్-ప్రూఫ్ ఆర్మర్ బాడీ డిజైన్ సులభంగా అందరి చూపునూ ఆకర్షిస్తుంది. ఇప్పుడు, దానికి నాలుగేళ్లకు పైగా ఉండే బ్యాటరీని కలిపి చూడండి. ఈ ఫోన్ బలంగా, దీర్ఘకాలికంగా ఉండడానికి తయారైంది. ఇది దాని కూల్ ధర పరిధిలో రూ.15,000 కంటే తక్కువకే అందుతోంది. OPPO కూడా ప్రీమియం ఫీచర్లను అందించడంలో ప్రశంసించదగింది. వీటిలో స్ప్లాష్ టచ్, IP54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, AI లింక్‌బూస్ట్ , డ్యూయల్-వ్యూయ్ వీడియో ఉన్నాయి. మీరు ఈ ధరలో గొప్ప పరికరానికి అప్‌గ్రేడ్ అవ్వాలని చూస్తున్నట్లయితే, OPPO K12x 5G సరైన ఎంపిక.
ధరలు
OPPO K12x 5G INR 12,999 (6GB+128GB) వేరియంట్, INR 15,999 (8GB+256GB) వేరియంట్లలో అందుబాటులో ఉంది . ఇది ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, OPPO ఈ-స్టోర్, ప్రధాన రిటైల్ అవుట్లెట్ల ద్వారా అమ్మకానికి ఉంది.