ఈ స్మార్ట్ ఫోన్ DXOMARK 2024 గోల్డ్ లేబుల్స్ అవార్డును కూడా అందుకుంది. లాంచ్‌కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ స్వయంగా షేర్ చేసింది.
HONOR Magic6 Proకి ప్రత్యేక ఫీచర్స్ కారణంగా గోల్డ్ లేబుల్స్ అవార్డు లభించింది. సుపీరియర్ రియర్ కెమెరా, సెల్ఫీ కెమెరా, ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్, వైబ్రెంట్ డిస్‌ప్లే, లాంగ్ లాస్ట్ బ్యాటరీ దీనిలో అందించినట్లు కంపెనీ తెలిపింది.
హానర్ మ్యాజిక్6 ప్రో ఫీచర్లు
ఈ ఫోన్ ఫీచర్లు అమెజాన్ ఇండియాలో చూడవచ్చు. ఇంకా క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్‌తో ఉంటుంది. ఇది 6.8-అంగుళాల 120Hz OLED LTPO అడాప్టివ్ డైనమిక్ స్క్రీన్. దీని పీక్ బ్రైట్ నెస్ 5000 నిట్స్. డాల్బీ విజన్ సపోర్ట్ ఇందులో ఉంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం నానోక్రిస్టల్ గ్లాస్ ఉపయోగించారు.
HONOR Magic6 Proలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, ఇది f/1.4-f/2.0 అల్ట్రా లార్జ్ ఇంటెలిజెంట్ వేరియబుల్ ఎపర్చర్‌తో వస్తుంది. 180MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంది. దీని కారణంగా 2.5x ఆప్టికల్ జూమ్ & 100X డిజిటల్ జూమ్ లభిస్తుంది. ఇందులో మూడో కెమెరా కూడా 50 ఎంపీ కెమెరా. సెల్ఫీ & వీడియో కాలింగ్ కోసం 50 MP కెమెరా కూడా అందించారు. TOF డెప్త్ సెన్సార్ కూడా ఉంది.
Snap dragon 8 Gen 3 చిప్‌సెట్ HONOR Magic 6 Proలో అందించారు. ఈ ఫోన్ అన్ని కొత్త హానర్ సెకండ్ జనరేషన్ లాగానే సిలికాన్ కార్బన్ బ్యాటరీతో ఉంటుంది. ఇది బ్యాటరీ నిర్వహణ చిప్‌సెట్. అందువల్ల ఇది పవర్ కెపాసిటీని పెంచుతుంది.
HONOR Magic6 Proలో పెద్ద 5600 mAh బ్యాటరీ ఉంది. దీంతో పాటు 80W హానర్ వైర్డ్ సూపర్‌ఛార్జ్ ఇచ్చారు. అంతే కాకుండా 66W హానర్ వైర్‌లెస్ సూపర్‌ఛార్జ్ కూడా ఇచ్చారు. కేవలం 40 నిమిషాల్లోనే 100 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.