వాట్సాప్ కంటే మెరుగ్గా ఉండే 7 యాప్‌లు

First Published | Aug 6, 2024, 11:56 AM IST

వాట్సాప్ అవతరణ ఒక సంచలనం. అయితే ఇప్పడు దానికి మించిన ప్రత్యామ్నాయాలు టెక్నాలజీ రంగంలో అందుబాటులోకి వచ్చేశాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ఎన్నో కొత్త యాప్ లు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 7 ముఖ్యమైన యాప్ లు ఏంటో తెలుసుకుందాం..
 

మెసెంజర్

మెసెంజర్ యాప్ ఫేస్ బుక్ కు చెందినది.  మెటా ప్లాట్‌ఫారమ్‌ దీన్ని అభివృద్ధి చేసింది.  ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు, ఆడియో మరియు ఫైల్‌లను మార్పిడి చేయడానికి చక్కటి యాప్ ఇది. చాట్ బాట్ ల వంటి ఇంటరాక్టివ్‌ ఫీచర్స్ Messengerలో ఉన్నాయి. చక్కటి క్వాలిటీతో వాయిస్, వీడియో  కాలింగ్  చేయవచ్చు.

స్కైప్

విశ్వసనీయమైన వాయిస్, వీడియో కాల్స్, గ్రూప్ వీడియో చాట్ లు అందించడంలో స్కైప్ ఉత్తమ సేవలందిస్తోంది. 17 జూన్ 2013న Windows,Mac OS, iOS, iPadOS, Android మరియు BlackBerry కోసం skype ఉచిత వీడియో సందేశ సేవలను విడుదల చేసింది. వ్యక్తిగతమైన సేవలతో పాటు, ఆఫీస్ మీటింగ్ లకు ఇది చక్కటి ప్రత్యామ్నాయం. 

Latest Videos


టెలిగ్రామ్

సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం, telegram భారతదేశంలో రెండవ అతిపెద్ద వినియోగదారులను కలిగిన సోషల్ మీడియా యాప్. టెలిగ్రామ్ సోషల్ నెట్‌వర్కింగ్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. వినియోగదారులు కథనాలను పోస్ట్ చేయడానికి , గరిష్టంగా 200,000 మంది సభ్యులతో పెద్ద పబ్లిక్ గ్రూప్‌లను సృష్టించడానికి అనుమతిస్తుంది.  పెద్ద ఫైల్ షేరింగ్, రహస్య చాటింగ్ కూడా చేసుకోవచ్చు. 

సిగ్నల్

ఇది తక్షణ సందేశం , వాయిస్ కాల్‌లు, వీడియో కాల్‌ల కోసం రూపొందించిన ప్రత్యేక యాప్.  signal ద్వారా ఇన్‌స్టంట్ మెసేజింగ్ ఫంక్షన్‌లో టెక్స్ట్, వాయిస్ నోట్స్, ఇమేజ్‌లు, వీడియోలు, ఇతర ఫైల్‌లను పంపవచ్చు. వన్ టు వన్, గ్రూప్ మెసేజింగ్‌ను కలిగి ఉంది. 
 

వైర్

వైర్ స్విస్ రూపొందించిన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ మరియు సహకార యాప్ ఇది. వాయిస్ కాల్‌, వీడియో కాల్‌, కాన్ఫరెన్స్ కాల్‌, ఫైల్ షేరింగ్ తదితర సదుపాయాలు wireలో ఉన్నాయి.  ఇది వ్యక్తిగత ఉపయోగం కోసం సురక్షితమైన మెసేజింగ్ యాప్. ఇందులో గరిష్టంగా 25 మంది ఒకేసారి గ్రూప్ కాలింగ్‌లో మాట్లాడుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్‌లో గరిష్టంగా 12 మంది పాల్గొనవచ్చు. 
 

వైబర్‌

అధిక నాణ్యత కలిగిన వాయిస్, వీడియో కాల్స్ దీని ప్రత్యేకత. సురక్షితమైన ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఇందులో ఉంది. పెద్ద ఫైల్ షేరింగ్ లో viber ఉత్తమంగా పనిచేస్తుంది. viber out ఆప్షన్ ద్వారా ఇంటర్నేషనల్ ల్యాండ్ లైన్, మొబైల్ కాలింగ్ సేవలను అందిస్తోంది. 
 

హైక్

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన టెక్ట్స్,  వాయిస్, వీడియో కమ్యూనికేషన్ కలిగిన యాప్. ఇది ఒక మల్టీఫంక్షనల్ ఇండియన్ యాడ్‌వేర్ అప్లికేషన్. hike ఇన్‌స్టంట్ మెసేజింగ్(IM),వాయిస్ ఓవర్ IP (VoIP)సేవలను అందిస్తోంది.

click me!