ఆన్‌లైన్ పేమెంట్ అలెర్ట్: ఈ నాలుగు తప్పులు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తాయి, ఎలా నివారించాలో తెలుసుకోండి

First Published | Jan 8, 2022, 7:06 PM IST

నేటి యుగంలో మనం టెక్నాలజీలో చాలా ముందుకు వచ్చాము. ఇంట్లో కూర్చొని నిమిషాల వ్యవధిలో అన్నీ ఒక్క క్లిక్‌తో పూర్తిచేయవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మీరు పేమెంట్ చేసే ఆప్షన్ తీసుకోండి. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా డబ్బు పంపాలి లేదా ఒకరి నుండి డబ్బు పొందాలన్న, కొనుగోళ్లు చేయాలన్న ఆన్‌లైన్ లావాదేవీల ద్వారానే జరుగుతుంది. 

మీరు నిమిషాల్లో మొబైల్ నుండి కంప్యూటర్‌కు ఆన్‌లైన్ లావాదేవీలు చేయవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఏదైనా వస్తువులు లేదా ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఈ సౌకర్యాలు పెరిగిన కొద్దీ సైబర్ మోసాలు కూడా బాగా పెరిగిపోయాయని కాదనలేం. మీరు చేసే ఒక చిన్న పొరపాటు మిమ్మల్ని తీవ్రంగా గాయపరచవచ్చు. అందుకే ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం, కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం...
 

ఓ‌టి‌పికి ప్రాధాన్యత ఇవ్వండి
మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఆన్‌లైన్ లావాదేవీ చేస్తున్నప్పుడు మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదటిది పాస్‌వర్డ్ అండ్ రెండవది ఓ‌టి‌పి. మీరు ఎల్లప్పుడూ ఓ‌టి‌పి ఆప్షన్ ఎంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ లావాదేవీలు చాలా సురక్షితం అలాగే మీ పాస్‌వర్డ్‌ను ఎవరూ చూడలేరు.
 

Latest Videos


కార్డ్ సమాచారాన్ని సేవ్ చేయవద్దు
మీరు ఆన్‌లైన్ లావాదేవీలు చేసినప్పుడు మీ కార్డ్ సమాచారాన్ని అక్కడ సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దీని అర్థం మీరు సి‌వి‌వి కాకుండా మీ కార్డ్ వివరాలను మళ్లీ మళ్ళీ రిజిస్టర్ చేయనవసరం లేకుండా  మీ లావాదేవీ పూర్తి చేయవచ్చు. కానీ భద్రతా కోణం నుండి ఇది సరైనది కాదు. కాబట్టి ఇలా చేయడం మానుకోండి.

మీ మొబైల్ లేదా సిస్టమ్ నుండి కొనుగోళ్లు చేయండి
మీరు ఏదైనా ఆన్‌లైన్ లావాదేవీని చేయాలనుకున్నప్పుడు ఎల్లప్పుడూ మీ పర్సనల్ మొబైల్ లేదా కంప్యూటర్/ల్యాప్‌టాప్ నుండి మాత్రమే చేయండి. ఏ సైబర్ కేఫ్, ఆఫీసు లేదా ఇతరుల సిస్టమ్ నుండి దీన్ని ఎప్పుడూ చేయవద్దు. హ్యాకర్లు ఈ సిస్టమ్‌ల ద్వారా మిమ్మల్ని మోసగించవచ్చు.
 

సి‌వి‌విని షేర్ చేయడం మానుకోండి
ఏదైనా ఆన్‌లైన్ లావాదేవీని పూర్తి చేయడానికి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సి‌వి‌వి అంటే కార్డ్ వెరిఫికేషన్ వాల్యు. మీరు దీన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. మీ ఆన్‌లైన్ లావాదేవీ సి‌వి‌వి ద్వారా మాత్రమే పూర్తి అవుతుంది.

click me!