బిగ్ బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్ సరికొత్త ప్రాడక్ట్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు..

First Published | Aug 24, 2021, 4:17 PM IST

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వన్‌ప్లస్  చివరకు బడ్స్ ప్రో ధర గురించి సమాచారం వెల్లడించింది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో గత నెలలో ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ 2 తో పాటు లాంచ్ చేశారు, అయితే దీని ధర, లభ్యత గురించి వెల్లడించలేదు. 

వన్‌ప్లస్ బడ్స్ ప్రోలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC),ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. దీనిలోని ప్రేజర్ ఇన్‌పుట్ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో పోలి ఉంటుంది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో అనేది గత సంవత్సరం లాంచ్ చేసిన వన్‌ప్లస్ బడ్స్  అప్‌గ్రేడ్ వెర్షన్. 

వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధర, లభ్యత

వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధర రూ .9,990. స్యామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రొ, జబ్రా ఎలైట్ 85టి, నథింగ్ ఇయర్ 1 కాకుండా ఒప్పో ఎన్ కొ  ఎక్స్ , అంకర్ సౌండ్ కోర్ లిబర్టీ ఎయిర్ 2 ప్రొలతో కూడా పోటీపడుతుంది.  దీనిని ఆగష్టు 26 మధ్యాహ్నం 12 గంటల నుండి గ్లోసీ వైట్, మ్యాట్ బ్లాక్ కలర్‌లో అమెజాన్, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ స్టోర్ నుండి విక్రయించనున్నారు.

వన్‌ప్లస్ బడ్స్ ప్రో స్పెసిఫికేషన్లు
 వన్‌ప్లస్ బడ్స్ ప్రోలో 11 ఎం‌ఎం డైనమిక్ డ్రైవర్, డాల్బీ అట్మోస్‌ సపోర్ట్, లాటెన్సి  రేటు 94 మిల్లీసెకన్లు, అయితే ఈ లాటెన్సి రేటు ప్రో గేమింగ్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్  తో పాటు వీటిలో  ఎక్స్‌ట్రీమ్, ఫెయింట్ అండ్ స్మార్ట్ వంటి మూడు  వేరు వేరు మోడ్‌లు  ఉన్నాయి. 
 

Latest Videos


నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్స్‌ట్రీమ్ మోడ్‌లో 40 డిబి వరకు, ఫెయింట్ మోడ్‌లో 25 డిబి వరకు స్మార్ట్ మోడ్ మీ చుట్టూ ఉన్న సౌండ్‌ను బట్టి ఆడియో క్వాలిటీని అడ్జస్ట్ చేస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో మూడు మైక్రోఫోన్‌లు ఇచ్చారు.

వన్‌ప్లస్ బడ్స్ ప్రో వాటర్ రెసిస్టెంట్ కోసం IPX4 రేటింగ్ పొందింది. ఈ రేటింగ్ కాకుండా డస్ట్ అండ్ వాటర్ రిసిస్టంట్ కోసం బడ్స్ IP55 సర్టిఫికెట్‌ పొందిండి. వన్‌ప్లస్ ఆడియో ఐడి పేరుతో కంపెనీ  వన్‌ప్లస్ బడ్స్ ప్రోలో ఒక ప్రత్యేక ఫీచర్ ఇచ్చింది. దీని సహాయంతో ఇయర్‌బడ్స్ పనితీరు వినియోగదారుల వినియోగాన్ని బట్టి మారుతుంది.

వన్‌ప్లస్ బడ్స్ ప్రో బ్యాటరీ లైఫ్ సంబంధించి దాదాపు 38 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేసింది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో ప్రతి ఇయర్‌బడ్‌ బ్యాటరీ లైఫ్ 10 గంటల బ్యాకప్‌ ఉంటుందని పేర్కొన్నారు. దీనికి  వైర్‌లెస్ ఛార్జింగ్‌  సపోర్ట్ కూడా ఉంది.

click me!