హాట్ పింక్ కలర్లో నోకియా 5జి ఫోన్.. బెస్ట్ ప్రైస్, ఎక్కువ స్టోరేజ్, ఎక్కువ మజా కూడా..

Published : Oct 12, 2023, 01:34 PM IST

HMD గ్లోబల్ గత నెలలో  నోకియా G సిరీస్‌ నోకియా G42 5Gని 6జీబీ  ర్యామ్ (5GB అదనపు వర్చువల్ ర్యామ్) 128GB స్టోరేజ్ వెర్షన్‌తో విడుదల చేసిన సంగతి మీకు తెలిసిందే. తాజాగా కంపెనీ  256GB స్టోరేజ్ వెర్షన్‌తో కొత్త 8జీబీ  ర్యామ్ (8GB అదనపు వర్చువల్ RAM)ని లాంచ్  చేసింది.  

PREV
14
హాట్  పింక్ కలర్లో నోకియా 5జి ఫోన్..  బెస్ట్ ప్రైస్, ఎక్కువ స్టోరేజ్, ఎక్కువ మజా కూడా..

Nokia G42 720 x 1612 రిజల్యూషన్,  20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్  450 nits బ్రైట్ నెస్, 560 nits వరకు పెంచే అప్షన్ తో  అతుకులు లేని అనుభవాన్ని అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 డిస్ ప్లేకి ప్రొటెక్షన్ గా ఇచ్చారు.

 ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 480+ SoC, డ్యూయల్  RAM అప్షన్స్  ఉన్నాయి.  స్టోరేజ్ మైక్రో SD కార్డ్‌తో 1TBకి పెంచుకోవచ్చు.
 

24

 ఆండ్రాయిడ్ 13, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సిస్టమ్‌, f/1.8 ఎపర్చర్‌తో 50 MP AF ప్రైమరీ కెమెరా, అలాగే f/2.4 ఎపర్చర్‌తో 2 MP డెప్త్ అండ్ 2 MP మాక్రో కెమెరా ఉంది. LED ఫ్లాష్, నైట్ మోడ్ 2.0, AI పోర్ట్రెయిట్ ఇంకా OZO 3D ఆడియో క్యాప్చర్ ఫోన్ ఫీచర్లలో ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ ఫేసింగ్ 8MP కెమెరా  ఉంది.
 

34

3.5mm ఆడియో కనెక్టర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP52 రేటింగ్‌తో డస్ట్ అండ్  స్ప్లాష్ ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి. 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.1,  GPS/GLONASS/Beidou కనెక్టివిటీ అవకాశాలలో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్  ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది.
 

44

కొత్త Nokia G42 5G (16GB (8GB వర్చువల్ RAM +256GB) ఎడిషన్ సో గ్రే, సో పర్పుల్,  సో పింక్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.  దీని ధర రిటైల్ షాపుల్లో ఇంకా  Nokia.comలో రూ. 16,999. మీరు సెలెక్ట్ చేసుకున్న రిటైల్ లొకేషన్స్ లో Nokia G42 5Gని కొన్నప్పుడు  మీరు లిమిటెడ్ కాలానికి రూ.999 విలువైన బ్లూటూత్ హెడ్‌సెట్‌  ఉచితంగా పొందుతారు. 

click me!