అంబానీ మామ ఫోన్ అదిరిందిగా.. తక్కువ ధరకే Jio 5G స్మార్ట్ ఫోన్.. ఎప్పుడో తెలుసా?

First Published | May 24, 2024, 11:02 AM IST

రిలయన్స్ జియో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా టెలికాం దిగ్గజం జియో మరో కీలక నిర్ణయం తీసుకోనుంది.

Jio 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAMతో వస్తుంది. అలాగే 128GB ఇంకా 256GB ఇంటర్నల్  స్టోరేజ్  అప్షన్  ఉంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
 

ఈ Jio 5G స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. 33w ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి ఈజిగా ఛార్జింగ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇంకా ఛార్జింగ్ 2 రోజుల వరకు ఉంటుంది.
 


ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేను పరిశీలిస్తే 5.5 అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. మీరు సులభంగా 4K క్వాలిటీ  వీడియోలను చూడవచ్చు. ఇప్పుడు చాలా మంది ఈ జియో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్నారు.
 

ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించబడలేదు. మీడియా నివేదికల ప్రకారం, జూన్ రెండవ లేదా మూడవ వారంలో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది.
 

 మీరు లాంచ్ తేదీ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ గురించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా త్వరలో ప్రకటించనున్నారు. కానీ ఈ ఫోన్ లాంచ్ సమయంలో దీని ధర రూ.3000 వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
 

Latest Videos

click me!