మరణించిన వ్యక్తులతో మాట్లాడించే మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజి.. ఎలా పనిచేస్తుందంటే ?

First Published Jan 30, 2021, 2:19 PM IST

ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో  వారికి  నచ్చిన వారు లేదా ఇష్టమైన వారిని కోల్పోయినందుకు బాధపడుతుంటారు, అది మనుషులు అయినా లేక జంతువులు అయినా. కానీ ప్రపంచాన్ని విడిచిపెట్టి, బంధాలను వొదులుకొంటు చనిపోయిన వారి నుండి ఎప్పటికీ మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే. అయితే అలాంటి వాటిని అధిగమించేందుకు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక చాట్‌బాట్‌కు పేటెంట్ తీసుకొచ్చింది, ఇది ప్రపంచాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు/ మృతి చెందిన వారు ఇక లేరు అనే కొరతను మిమ్మల్ని అనుభవించనివ్వదు.

ప్రస్తుతానికి కస్టమర్ కేర్ సపోర్ట్ కోసం చాట్‌బాట్‌లను సాధారణంగా చాలా కంపెనీలు ఉపయోగిస్తాయి, అయితే రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్‌బాట్ ఈ ప్రపంచంలో లేని వారితో కూడా మాట్లాడిస్తుంది. అవును నిజమే.. మైక్రోసాఫ్ట్ పేటెంట్ చాట్‌బాట్ తో మరణించిన వ్యక్తులతో మీరు మాట్లాడవచ్చు లేదా సంప్రదించవచ్చు.
undefined
మైక్రోసాఫ్ట్ చాట్‌బాట్ అమెరికా ప్రముఖ టీవీ సిరీస్ 'బ్లాక్ మిర్రర్' పై ఆధారపడింది. బ్లాక్ మిర్రర్ లో ఒక అమ్మాయి తన చనిపోయిన ప్రియుడితో సోషల్ మీడియా నుండి సేకరించిన సమాచారం సహాయంతో మాట్లాడుతుంది. అయితే ఆ అమ్మాయి ప్రియుడు ఒక ప్రమాదంలో మరణిస్తాడు.
undefined
ఈ ప్రత్యేకమైన మైక్రోసాఫ్ట్ చాట్‌బాట్ ఎలా పని చేస్తుంది?మీరు ఈ ప్రపంచంలో లేని వారు తో మాట్లాడాలనుకుంటె లేకపోతే సంప్రదించాలనుకుంటే ఈ చాట్‌బాట్ మీకు సహాయపడుతుంది. దివంగత నటి శ్రీదేవితో మాట్లాడాలనుకుంటే ఈ చాట్‌బాట్ మీ కలను నెరవేరుస్తుంది.
undefined
ఇంటర్నెట్ అండ్ మైక్రోసాఫ్ట్ డేటాబేస్లో ఉన్న సమాచారం ఆధారంగా, ఈ చాట్‌బాట్ మీతో మాట్లాడుతుంది ఇంకా మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.
undefined
ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ చాట్‌బాట్ మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో అదే విధంగా మాట్లాడుతుంది. దీని ద్వారా మీరు కోల్పోయిన వారిని పరోక్షగా దగ్గర చేస్తుంది. మైక్రోసాఫ్ట్ నుండి వస్తున్న ఈ చాట్‌బాట్ ప్రారంభం లేదా లభ్యత గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
undefined
click me!