మరోసారి అమ్మకాని యాహూ సెర్చ్ ఇంజన్...! డీల్‌ విలువ ఎంతో తెలుసా..!

First Published May 6, 2021, 6:32 PM IST

 ఒకప్పుడు సెర్చ్ ఇంజన్ల పరంగా ప్రపంచాన్ని పరిపాలించిన యాహూని 2016లో వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఇంక్ సుమారు 5 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు యాహూని  మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. 

గతంలో కూడా అంటే 2008లో మైక్రోసాఫ్ట్ యాహూను కొనడానికి 44 బిలియన్ డాలర్లు ఇచ్చింది, కానీ దీనిని యాహూ తిరస్కరించింది. ఇప్పుడు 13 సంవత్సరాల తరువాత మైక్రోసాఫ్ట్ మళ్ళీ 44.6 బిలియన్ డాలర్లు లేదా సుమారు 3.3 లక్షల కోట్లకు యాహూని దక్కించుకునేందుకు సిద్దమైంది, అయినప్పటికీ ఈ ఒప్పందం ఇంకా ఆమోదించలేదు.
undefined
ఈ ఒప్పందం గురించి వార్తలు వచ్చిన తరువాత యాహూ షేర్ ధర 48 శాతం పెరిగింది. యాహూను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఒక లేఖ కూడా రాసింది.
undefined
వార్తలు, ఫైనాన్షియల్, స్పొర్ట్స్ కోసం ప్రతి నెలా సుమారు 500 మిలియన్ల యూజర్లు యాహూకు వస్తారు. ఇది కాక ఇమెయిల్ సేవలో కూడా యాహూ ఆధిపత్యం చెలాయిస్తుంది, అయినప్పటికీ మైక్రోసాఫ్ట్ కి కూడా సొంత ఇ-మెయిల్ సర్వీస్ ఉంది.
undefined
గూగుల్ కి పెద్ద ఛాలెంజ్యాహూను కొనుగోలు చేయడంలో మైక్రోసాఫ్ట్ విజయవంతమైతే గూగుల్ కి నేరుగా పోటీ ఏర్పడుతుంది, ఎందుకంటే గూగుల్ సెర్చ్ ఇంజన్ నుండి యాప్, ఆపరేటింగ్ సిస్టమ్ వరకు ఆధిపత్యం ఉంది. యాహూలో యాహూ సెర్చ్ ఇంజన్, యాహూ మెయిల్, యాహూ ఎంటర్టైన్మెంట్, యాహూ ఫైనాన్స్, యాహూ లైఫ్ స్టైల్, యాహూ మెయిల్ సహా ఏడు సేవలు ఉన్నాయి. యు.ఎస్‌లో సెర్చ్ ఇంజన్లలో గూగుల్ మార్కెట్ వాటా 88 శాతం ఉండగా, బింగ్ 5.35 శాతం, యాహూ 3.04 శాతం వాటా ఉంది.
undefined
click me!