ఇండియాలోకి రెడ్‌మి మొట్టమొదటి ల్యాప్‌టాప్‌.. 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో లాంచ్..

First Published Jul 30, 2021, 1:33 PM IST

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి భారతదేశంలో తొలి ల్యాప్‌టాప్‌ను విడుదల చేస్తున్నట్లు  ధృవీకరించింది. రెడ్‌మి బుక్ పేరుతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌ ఆగస్టు 3న భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. 

ఇందుకు రెడ్‌మి ఇండియా మీడియా ఇన్విటేషన్లు కూడా ప్రారంభించింది. గత సంవత్సరం షియోమి ఎం‌ఐ నోట్‌బుక్‌తో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది. రెడ్‌మి బ్రాండ్ చెందిన రెడ్‌మి బుక్, రెడ్‌మి బుక్ ఎయిర్ అండ్ రెడ్‌మి బుక్ ప్రో ల్యాప్‌టాప్ మోడళ్లు చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా రెడ్‌మి బుక్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
undefined
గత ఏడాది షియోమి రెడ్‌మిని ప్రత్యేక బ్రాండ్‌గా పరిచయం చేసి దాని కింద పవర్ బ్యాంకులు, ఇయర్‌బడ్లు, స్మార్ట్‌బ్యాండ్‌లు వంటి లైఫ్ స్టయిల్ ప్రాడక్ట్స్ అందిస్తామని తెలిపింది. అయితే కంపెనీ తాజాగా టీవీలను కూడా భారతదేశంలో విడుదల చేసింది. రెడ్‌మి ఇండియా నుండి రాబోయే ల్యాప్‌టాప్ కోసం #SuperStart హ్యాష్‌ట్యాగ్‌ను ప్రవేశపెట్టింది.
undefined
కంపెనీ ల్యాప్‌టాప్‌ టీజర్ పోస్టర్‌ను కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది, దీని ప్రకారం ల్యాప్‌టాప్‌లో బెజెల్ లెస్ డిస్‌ప్లే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కంపెనీకి చైనాలో మూడు ల్యాప్‌టాప్‌ మోడల్స్ ఉన్నాయి. అయితే భారతదేశంలో ఏ మోడల్ ప్రవేశపెట్టబడుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. తాజాగా రెడ్‌మి బుక్ ప్రొ 14, రెడ్‌మి బుక్ ప్రొ 15 ఏ‌ఎం‌డి రైజెన్ 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో చైనాలో ప్రవేశపెట్టరు. రెడ్‌మి బుక్ కాకుండా ఎం‌ఐ నుండి మరో కొత్త ల్యాప్‌టాప్ కూడా వచ్చే అవకాశం ఉంది, అయితే దీనిని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
undefined
click me!