ముఖేష్ అంబానీ వాడుతున్న కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ ! స్పెషలిటీ ఏంటో తెలుసా?

First Published | Aug 7, 2024, 1:58 PM IST

ఆసియాలోనే అతిపెద్ద బిలియనీర్ ముఖేష్ అంబానీ పర్సనల్  అవసరాల కోసం ఏ మొబైల్ ఫోన్ వాడుతున్నారో తెలుసా? ఆ ఖరీదైన స్మార్ట్ ఫోన్ ప్రీమియం లుక్‌తో వస్తుంది ఇంకా  చాలా లేటెస్ట్  టెక్నికల్  సామర్థ్యాలతో ఉంటుంది.
 

ముఖేష్ అంబానీ తాజాగా తన చిన్న కొడుకు  ఆనంద్ అంబానీ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే పెళ్లి వేడుకలో తీసిన ఫోటోలను బట్టి అతను ఏ ఫోన్ వాడుతున్నాడో కూడా తెలిసిపోతుంది.
 

ముఖేష్ అంబానీ ఆల్ టైమ్ ఫెవరెట్ మొబైల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వాడుతున్నారు. ఈ ఫోన్  అధునాతన ఫీచర్లతో ఆపిల్ కంపెనీ  లేటెస్ట్  స్మార్ట్‌ఫోన్. ఐఫోన్ 15 సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్ కూడా. 1 TB స్టోరేజ్ ఉన్న మోడల్ ధర దాదాపు రూ. 2 లక్షలు. 256 GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ. 1.50 లక్షలు.
 


ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో 48MP, 12MP & 12MP సెన్సార్‌లతో పవర్ ఫుల్ కెమెరా సెటప్‌  ఉంది. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. గ్రేడ్-5 టైటానియంతో తయారైన ఈ సెల్ ఫోన్ దృఢంగా ఉండటమే కాకుండా వాటర్ ప్రూఫ్ కూడా. దీని స్మూత్ అండ్ గ్లాసి డిజైన్ మంచి పర్ఫార్మెన్స్  ఇస్తుంది.
 

ఈ లగ్జరీ ఫోన్‌ను అంబానీ కుటుంబంలో ముకేశ్ అంబానీ మాత్రమే కాదు, ఆయన సతీమణి నీతా అంబానీ కూడా ఇదే మొబైల్‌ను ఉపయోగిస్తున్నారు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ భారతదేశంలోని వివిధ ప్రముఖులు, రాజకీయ నాయకుల చేతుల్లో కూడా కనిపిస్తుంటుంది.
 

Latest Videos

click me!