పండగకి కొత్త ప్లాన్‌లను పరిచయం చేసిన జియో.. ఇప్పుడు ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ కూడా..

First Published | Jan 11, 2024, 6:10 PM IST

దేశీయ టెలికాం, ఇండియాలోనే నంబర్ వన్ నెట్ వర్క్ రిలయన్స్ జియో UAE, US కోసం కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది.  ఇప్పుడు  కస్టమర్ల కోసం  అన్యువల్  ప్లాన్ కూడా ఉంది. అంతేకాదు 60% చౌకైన ఇన్-ఫ్లైట్ ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది.
 

UAE కోసం అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లు

యుఎఇ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ల క్రింద జియో మూడు కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో రూ. 2,998, రూ. 1598 ఇంకా  రూ. 898 ఉన్నాయి.

రూ. 2,998 ప్లాన్ కింద 250 అవుట్‌గోయింగ్ నిమిషాలు,  250 ఇన్‌కమింగ్ నిమిషాలు పొందుతారు. ఈ ప్లాన్ 21 రోజుల వాలిడిటీతో వస్తుంది ఇంకా 7GB డేటాను అందిస్తుంది. ప్లాన్‌తో 100 SMSలు కూడా లభిస్తాయి. మరోవైపు, రూ.1598 ప్లాన్ 150 అవుట్‌గోయింగ్ అండ్ ఇన్‌కమింగ్ నిమిషాలతో పాటు 3GB డేటా అండ్  100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ 14 రోజులు వాలిడిటీ అవుతుంది. చివరగా, రూ.898 ప్లాన్ 1GB డేటా, 100 ఇన్‌కమింగ్ అండ్  అవుట్‌గోయింగ్ నిమిషాలను అందిస్తుంది.  7 రోజులు వాలిడిటీ ఉంటుంది. అలాగే 100 SMSలను అందిస్తుంది.

US కోసం అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లు

UAE లాగానే  Jio US ట్రావెల్  కోసం మూడు కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను ప్రకటించింది. వీటిలో  రూ. 3455, రూ. 2555 అండ్ రూ. 1555 ప్లాన్‌లు ఉన్నాయి. అన్ని ప్లాన్‌లు కాలింగ్ అండ్ డేటా ప్రయోజనాలను అందిస్తాయి.

రూ. 3455 ప్లాన్ కింద కాల్స్ చేయడానికి 250 నిమిషాలు, 25GB డేటా పొందుతారు. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీ వస్తుంది ఇంకా 100 SMSలను అందిస్తుంది. రూ. 2555 ప్లాన్‌లో భాగంగా, జియో కస్టమర్లు 100 SMSలతో 250 నిమిషాలు ఇంకా  15GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 21 రోజుల పాటు వాలిడిటీ అవుతుంది. రూ. 1555 ప్లాన్ 10 రోజులు వాలిడిటీ  అవుతుంది.  100 SMS అండ్ 150 కాలింగ్ నిమిషాలతో మొత్తం 7GB డేటాను అందిస్తుంది.
 


అన్యువల్ రోమింగ్ ప్యాక్‌లు

కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లతో పాటు, జియో కొత్త అన్యువల్  ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టింది, దీని ధర రూ. 2,799. ఈ అన్యువల్ ప్లాన్ 51 దేశాలలో వర్తిస్తుంది ఇంకా  2GB డేటాను అండ్ 365 రోజుల వాలిడిటీ  అందిస్తుంది.

ఇన్ ఫ్లయిట్ డేటా ప్యాక్‌లు

Jio రూ. 195, రూ. 295, రూ. 595 అనే  మూడు కొత్త ఇన్-ఫ్లైట్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ మూడు ప్లాన్‌ల క్రింద 100 వాయిస్ నిమిషాలు, 100 SMSలను అందిస్తుంది. అలాగే, అన్ని ప్లాన్‌లు 1 రోజు వరకు వాలిడిటీ అవుతుంది. రూ.195 ప్లాన్‌లో 250ఎంబీ డేటా, రూ.295తో 500ఎంబీ, రూ.595 ప్లాన్‌తో 1జీబీ డేటాను అందిస్తాయి.

వివిధ దేశాల కోసం ఇన్ ఫ్లయిట్ వాయిస్ అండ్  డేటా ప్యాక్‌లు

జియో 22 ఎయిర్‌లైన్స్ అండ్ 51 దేశాలకు వర్తించే నాలుగు ఇన్-ఫ్లైట్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్‌లలో రూ.2,499, రూ.4,999, రూ.3999 అండ్ రూ.5,999 ఉన్నాయి.

రూ.2,499 ప్లాన్ కింద 100 అవుట్‌గోయింగ్ నిమిషాలు, 250MB డేటా, 10 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్ 35 దేశాలకు వర్తిస్తుంది. Jio నుండి రూ.4,999 ఇన్-ఫ్లైట్ ప్లాన్ 1500 నిమిషాలు, 5GB డేటా ఇంకా 1500 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వరకు వాలిడిటీ అవుతుంది. రూ.3,999 ప్లాన్ 4GB డేటాతో పాటు 30 రోజుల వాలిడిటీ ఇంకా  100 SMSలను అందిస్తుంది. చివరగా, రూ. 5,999 ప్లాన్ 400 కాలింగ్ నిమిషాలు, 6GB డేటా ఇంకా  500 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 30 రోజులు వాలిడిటీ అవుతుంది.  

Latest Videos

click me!