జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్: కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌.. 365 రోజుల వాలిడిటీతో ఫుల్ బెనెఫిట్స్..

Ashok Kumar   | Asianet News
Published : Dec 29, 2021, 11:40 AM IST

కొత్త సంవత్సరంతో చాలా మార్పులు వస్తున్నాయి. దీనితో పాటు కొత్త సంవత్సరం రాకముందే జియో(jio) వినియోగదారులకు అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. ప్రజల అభిమాన జియో సేవలతో  వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌(prepaid plan)ను ప్రవేశపెట్టింది. జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ హ్యాపీ న్యూ ఇయర్(happy newyear) 2022 ఆఫర్ పేరుతో పరిచయం చేసింది. 

PREV
14
జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్: కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌.. 365 రోజుల వాలిడిటీతో ఫుల్ బెనెఫిట్స్..

ఈ ఆఫర్ ప్రస్తుతం మై జియో యాప్ రీఛార్జ్ ప్లాన్‌లలో మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలతో జియో అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు 36 రోజుల వాలిడిటీతో 504 జి‌బి డేటాను పొందుతారు. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ 29 రోజుల అదనపు వాలిడిటీని కూడా అందిస్తుందని జియో చెబుతోంది, ఈ సమాచారం జాబితా చేసిన ప్లాన్ పైన ఒక చిన్న మెసేజులో పేర్కొంది. ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం...

24

కస్టమర్లు ఈ సౌకర్యాలను పొందవచ్చు
జియో హ్యాపీ న్యూ ఇయర్ 2022 ఆఫర్‌ను ప్రవేశపెట్టింది, దీని ధర రూ. 2545గా పేర్కొంది. దీని వాలిడిటీ 365 రోజులు, దీని కింద రోజుకి 1.5జి‌బి డేటా అందుబాటులో ఉంటుంది. 
 

34

అయితే ఈ ప్లాన్‌ని ఎంచుకుంటే వినియోగదారుడు ఏడాదికి మొత్తం 547.5జి‌బి డేటాను పొందుతారు. అంటే ఒక రోజులో 1.5జి‌బి డేటా డైలీ లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గించబడుతుంది. 

దీనితో పాటు జియో హ్యాపీ న్యూ ఇయర్ 2022 ప్లాన్ ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 100 ఎస్‌ఎం‌ఎస్, జియో యాప్‌లకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది, ఇందులో జియో టి‌వి, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ఉన్నాయి.

44

జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌ల కోసం న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం 2020లో కూడా జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లకు ఇంకా జియో ఫోన్ వినియోగదారులకు '2020 హ్యాపీ న్యూ ఇయర్'ని అందించింది. ఇందులో ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జి‌బి డేటా, డైలీ 100 ఎస్‌ఎం‌ఎస్ అలాగే జియో యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. మొత్తంమీద వినియోగదారులు ఏడాదికి 547.5జి‌బి డేటాను పొందుతారు.

click me!

Recommended Stories