భారత మార్కెట్లోకి ఐటెల్ సిటీ 300 5G (Itel City 300 5G) ఫోన్ వచ్చేసింది. కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఇది మంచి ఆప్షన్. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
ఐటెల్ కంపెనీ సిటీ 300 5G స్మార్ట్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. స్మూత్ స్క్రోలింగ్ కోసం ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తోంది. అలాగే ఇందులో 5,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి.
24
ఐటెల్ సిటీ 300 5G ధర ఎంతంటే?
ఈ ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ ₹14,999 గా నిర్ణయించింది. డార్క్ రూబీ, మిస్ట్ బీజ్, బోల్డ్ ఇండిగో అనే మూడు కలర్స్‌లో ఈ ఫోన్ దొరుకుతుంది. కస్టమర్లు ఈ మొబైల్‌ను ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
34
ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇవే..
6.67-అంగుళాల HD+ LCD స్క్రీన్
120Hz రిఫ్రెష్ రేట్
పంచ్-హోల్ డిజైన్ డిస్‌ప్లే
2.5D కర్వడ్ గ్లాస్
6nm టెక్నాలజీతో తయారీ
యూనిసాక్ T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్
4GB LPDDR4X RAM, 64GB స్టోరేజ్
మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్‌పై పనిచేస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను కంపెనీ ఇందులో ఇచ్చింది. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.0, వై-ఫై 5 సపోర్ట్ ఉన్నాయి.