ఇండియాలోకి ఐక్యూ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. అందిస్తున్న ఫీచర్స్ గురించి తెలుసుకోండి..

First Published Aug 4, 2021, 2:54 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐక్యూ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 17న లాంచ్ కానుంది. ఈ సమాచారాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఐక్యూ 8 సిరీస్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్, మల్టీ కెమెరాలతో అందిస్తున్నారు. ఐక్యూ 8 ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించిన ఐక్యూ 7కి అప్‌గ్రేడ్ వెర్షన్. 

ఐక్యూ 8 సిరీస్ కింద, ఐక్యూ 8, ఐక్యూ 8 ప్రో అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ చేయనున్నారు. 2కే ఆమోలెడ్ డిస్‌ప్లే ఐక్యూ 8 తో కనుగొనవచ్చు, దీని రిఫ్రెష్ రేట్ 120Hz. కంపెనీ ఐక్యూ 8 సిరీస్‌ గురించి  చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో ప్రకటించింది. 
 

ఐక్యూ 8 సిరీస్ ఆగస్టు 17న రాత్రి 7.30 గంటలకు చైనాలో లాంచ్ అవుతుంది. తాజాగా కంపెనీ టీజర్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది, అయితే  ఫోన్ ఫీచర్లు లేదా డిజైన్ గురించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ సిరీస్ ఆగస్టు 4న లాంచ్ కాబోతున్నట్లు గతంలో లీక్ చేసిన నివేదికలో పేర్కొంది.
 

లీకైన నివేదికలో ఐక్యూ  8  మోడల్ నంబర్ V2141Aగా తెలిపింది. ఐక్యూ 8 2కే ఆమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, 1440x3200 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో ఉంటుందని తెలుస్తుంది. అలాగే దీని డిస్‌ప్లే స్యామ్సంగ్ ఆమోలెడ్ ఈ5 లూమినిసెంట్ ఎల్‌టి‌పిఓ 10 బిట్ కావచ్చు.
 

అంతేకాకుండా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్, 12 జి‌బి ర్యామ్, 4 జి‌బి ఎక్స్‌టెండెడ్ మెమరీ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి. స్టోరేజ్ కోసం 256జి‌బి ఆప్షన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత OriginOS 1.0 ఫోన్‌తో అందుబాటులో ఉంటుంది.
 

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఐక్యూ 7 లెజెండ్‌తో పాటు ఐక్యూ 7 భారతదేశంలో విడుదల చేసింది. ఐక్యూ 7 లో స్నాప్‌డ్రాగన్ 870 కాగా లెజెండ్ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఇచ్చారు. ఇండియన్ మార్కెట్లో ఐక్యూ 7 ప్రారంభ ధర రూ .31,990, ఐక్యూ 7 లెజెండ్ ప్రారంభ ధర రూ .39,990.

click me!