ఐఫోన్ 16 అప్‌డేట్: ఫీచర్స్ పై అతిపెద్ద న్యూస్ లీక్!

First Published | Apr 9, 2024, 4:17 PM IST

 ఆపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌లలో భారీ అప్‌గ్రేడ్ చేయబోతోంది.  దీని గురించి కొంత సమాచారం లీక్ కాగా  కంపెనీ iPhone 16 ఫోన్‌ల బ్యాటరీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నట్లు చెప్పబడింది. 2023లో విడుదలైన ఐఫోన్‌లతో పోలిస్తే, ఈ ఏడాది విడుదల కానున్న iPhone 16, iPhone 16 Pro అండ్ iPhone 16 Pro Max మోడళ్ల బ్యాటరీ సామర్థ్యంలో పెద్ద మార్పు కనిపిస్తుందని టిప్‌స్టర్   నివేదికలో పేర్కొంది.

అయితే ఐఫోన్ 15 ప్లస్ మొబైల్ కంటే ఐఫోన్ 16 ప్లస్ మొబైల్ మాత్రమే తక్కువ కెపాసిటీ బ్యాటరీతో  ఉండనున్నట్లు  సమాచారం. Weiboలో iPhone 16 సిరీస్ మొబైల్‌ల బ్యాటరీ సామర్థ్యంపై కూడా నివేదించారు. లీక్ అయిన సమాచారం ప్రకారం, iPhone 16 Pro Max 4,676mAh బ్యాటరీతో  అలాగే iPhone 16 Pro 3,355mAh బ్యాటరీతో  ఉంటుందని తెలిపింది.

 ఇక  iPhone 16 ఫోన్ 3,561mAh బ్యాటరీతో వస్తుందని చివరగా, iPhone 16 Plus 4,006mAh బ్యాటరీతో ఉండనుంది. సాధారణంగా iPhone కొత్త మోడల్ ఫోన్‌లను విడుదల చేసే వరకు దాని బ్యాటరీ సామర్థ్యాల గురించి ఎప్పుడూ వెల్లడించదు. గతేడాది విడుదలైన iPhone 15 3,367mAh, iPhone 15 Plus 4,383mAh, iPhone 15 Pro 3,290mAh  ఇంకా iPhone 15 Pro Max   4,422mAh   బ్యాటరీ కెపాసిటీతో వచ్చాయి.  
 


ఐఫోన్ 16 ప్రో  మ్యాక్స్ 4,676 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది, ఇది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లోని 4,422 ఎంఏహెచ్ బ్యాటరీ కంటే 1% తక్కువ.   iPhone 16 Plus 4,006mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది అంటే  iPhone 15 ప్లస్‌లోని 4,383mAh బ్యాటరీ కంటే ఒక శాతం తక్కువ. 
 

Apple గత సంవత్సరం iPhone 15 మోడల్‌లలో రీఛార్జ్ చేయగల లిథియం-అయాన్ బ్యాటరీని పొందింది. నాన్-ప్రో మోడల్స్‌లోని బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని ఆఫర్ చేస్తుందని, అయితే ప్రో మోడల్‌లోని బ్యాటరీ ఒక్క ఛార్జ్‌పై   29 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుందని  తెలిపింది. 
 

Latest Videos

click me!