ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాకింగ్.. రిచార్జ్ ప్లాన్‌ ధరల పెంపు..?

First Published Nov 22, 2021, 2:02 PM IST

దేశీయ టెలికాం (telecom)కంపెనీ ఎయిర్‌టెల్ (airtel)వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్-ప్లాన్‌(prepaid plan)ల ధరలను రహస్యంగా మార్చేసింది. పెరిగిన ధరలతో ఎయిర్‌టెల్ ఆవరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ (ARPU)రూ. 200 పెంచుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ మాత్రమే ప్రీ-పెయిడ్ టారిఫ్‌ ధరలను పెంచింది.

వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో కూడా త్వరలో ప్లాన్‌లను ఖరీదైనవిగా మార్చగలవు అని భావిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం ఎయిర్‌టెల్  చౌకైన ప్లాన్ ఇప్పుడు రూ. 99గా మారింది, ఇంతకుముందు రూ. 79గా ఉంది, అయితే ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త ధరలు అప్‌డేట్ చేయలేదు. కానీ కొత్త ధరలు నవంబర్ 26 నుంచి అమల్లోకి రావచ్చు. 
 

ఎయిర్‌టెల్ చౌకైన ప్లాన్ ఇప్పుడు రూ.99
ఎయిర్‌టెల్  చౌకైన ప్రీ-పెయిడ్ ప్లాన్ ఇంతకు ముందు రూ. 79గా ఉండేది కానీ ఇప్పుడు రూ. 99గా మారింది. అంటే బేస్ ప్లాన్ ధర రూ.20 పెరిగింది. ఈ ప్లాన్‌తో  మీకు రూ. 99 టాక్ టైమ్ లభిస్తుంది. అంతేకాకుండా 200MB డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో  ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉండదు.

 రూ. 149 ప్లాన్ ఇప్పుడు ఈ రూ. 179 
 ఎయిర్‌టెల్ రూ. 149 ప్లాన్ ఇప్పుడు రూ. 179గా మారింది. ఈ ప్లాన్‌ 28 రోజుల వాలిడిటీతో  ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్  ఉంటుంది.
 

రూ.219ప్లాన్ ఇప్పుడు రూ. 265 
ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్ ధరను రూ. 265 కి మార్చింది. ఇందులో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లతో 1జి‌బి డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్  లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

రూ.249 ప్లాన్ ఇప్పుడు రూ.299
గతంలో రూ.249గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.299కి పెరిగింది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఇందులో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు, ప్రతిరోజూ 1.5 GB డేటా అందుబాటులో ఉంటుంది.

 రూ.298 ప్లాన్ ఇప్పుడు రూ.359
రూ.298ప్లాన్ కోసం  ఇప్పుడు రూ.359 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో రోజుకు 2జి‌బి డేటా, 100 ఎస్‌ఎం‌ఎస్ లను పొందుతారు. దీని వాలిడిటీ 28 రోజులు.


రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ. 479
56 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ.479గా మారింది. ఇందులో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి.

రూ.449 ప్లాన్ ఇప్పుడు రూ.549
ఈ పెరుగుదల తర్వాత 56 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.449 ప్లాన్ ఇప్పుడు రూ.549గా మారింది. ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్‌ఎం‌ఎస్ ల సౌకర్యంతో రోజుకు 2 జి‌బి డేటా వస్తుంది.

 రూ. 379 ప్లాన్ ఇప్పుడు రూ.455
84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న  రూ.379 ప్లాన్ ఇప్పుడు రూ.455గా మారింది.  మొత్తం 6 GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్, ఆన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని ఇస్తుంది. నంబర్‌ను కొనసాగించే వారికి మాత్రమే ఈ ప్లాన్ ఉత్తమమైనది.

click me!