ఐఫోన్ 13 మినీ 128 జిబి వేరియంట్ ధర రూ. 69,900, 256 జిబి వేరియంట్ ధర రూ. 79,900, 512 జిబి వేరియంట్ ధర రూ .99,900. అలాగే ఐఫోన్ 13 128జిబి వేరియంట్ ధర రూ. 79,900, 256జిబి వేరియంట్ ధర రూ. 89.900, 512జిబి వేరియంట్ ధర రూ .1,09,900.
ఇప్పుడు ఐఫోన్ 13ప్రొ, ఐఫోన్ 13ప్రొ మ్యాక్స్ ని 1 టిబి స్టోరేజ్‌తో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఐఫోన్ 13 ప్రో 128జిబి వేరియంట్ ధర రూ .1,19,900, 256జిబి వేరియంట్ ధర రూ .1,29,900, 512జిబి వేరియంట్ ధర రూ .1,49,900, 1 టిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .1,69,900. ఐఫోన్ 13ప్రొ మ్యాక్స్ 128జిబి వేరియంట్ ధర రూ .1,29,900, 256జిబి వేరియంట్ ధర రూ .1,39,900, 512జిబి వేరియంట్ ధర రూ .1,59,900, 1 టిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .1,79,900. ఈ ఇఫోన్లన్నిటిని సెప్టెంబర్ 17 నుండి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు అలాగే సెప్టెంబర్ 24 నుండి విక్రయించనున్నారు.