ప్రపంచంలోనే తొలిసారి: ఈ ఐఫోన్ 64 లక్షలకు వేలం.. ఎందుకో తెలుసా..?

First Published | Nov 13, 2021, 3:23 PM IST

ప్రపంచంలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్(smartphone) లేదా మరేదైనా గాడ్జెట్ అమ్ముడైనప్పుడు అది బంగారం లేదా వజ్రాలతో ఉంటుంది, కానీ ఈసారి ఎవరూ ఊహించని విధంగా అత్యధిక ధరకు ఈ ఫోన్ అమ్ముడైంది. ఈ ఫోన్‌లో బంగారం లేదా డైమండ్ పొదిగించి లేవు. 

 అవును,  ప్రపంచంలోనే మొట్టమొదటి టైప్-సి పోర్ట్‌తో ఐఫోన్ ఎక్స్ గురించి చెప్పబోతున్నాము. ఐఫోన్ ఎక్స్ 2017 సంవత్సరంలో లాంచ్ అయ్యింది, అయితే నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేవలం ఒక ఛార్జింగ్ పోర్ట్ కారణంగా  86,001 డాలర్లు అంటే దాదాపు రూ. 63,97,000 వేలం జరిగింది.

ఇ-కామర్స్ సైట్ వేలం
పిల్లోనెల్ అనే విద్యార్థి ఈ ఫీట్ చేశాడు. పిల్లోనెల్ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, అతను ఐఫోన్ ఎక్స్  ఛార్జింగ్ పోర్ట్‌ను మోడిఫై చేసి టైప్-సి పోర్ట్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐఫోన్ ఎక్స్ లో టైప్-సి పోర్ట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్ ఛార్జింగ్, డేటా బదిలీ కూడా జరుగుతోంది. మోడిఫై ఐఫోన్ ఎక్స్ ఈ ఏడాది అక్టోబర్‌లో తయారు చేయబడింది. నవంబర్ 1న eBayలో వేలానికి వచ్చింది. ఆపిల్ ఐఫోన్‌లో చాలా కాలంగా లైట్నింగ్ పోర్ట్‌ను ఉపయోగిస్తోంది. ఐఫోన్ ఎక్స్ కూడా 2017లో లైట్నింగ్ పోర్ట్‌తో పరిచయం చేసింది. పిల్లోనెల్ ఐఫోన్ ఎక్స్  లైట్నింగ్ పోర్ట్‌ను యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్‌తో భర్తీ చేశాడు నేడు విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
 

 ఐఫోన్ ఎక్స్ లో టైప్-సి పోర్ట్‌ను ఇన్‌స్టాల్ చేయడం మనం భావించినంత సులభం కాదు. పిల్లోనెల్ ఆపిల్ సి94 కనెక్టర్‌ను రివర్స్ ఇంజనీరింగ్ సహాయంతో మోడిఫై చేసి ఫిమెల్  టైప్-సి పోర్ట్ సహాయంతో స్వంత పి‌సి‌బి బోర్డ్‌ను తయారు చేశాడు ఆ తర్వాత లాంగ్ టెస్టింగ్ అనంతరం ఫోన్‌కు ఫైనల్ టచ్ ఇచ్చారు.

Latest Videos


ఈ షరతులతో ఐఫోన్ ఎక్స్  వేలం
ప్రపంచంలోనే మొట్టమొదటి టైప్-సి పోర్ట్ ఉన్న ఐఫోన్, ఐఫోన్ ఎక్స్ ని  కొన్ని షరతులతో వేలం వేసారు, అందులో ఒకటి ఐఫోన్ ఎక్స్  కోసం వేలం వేసిన వ్యక్తి ఫోన్‌ను అప్‌డేట్ చేయలేరు లేదా ఫోన్ రిస్టోర్  చేయలేరు. అంతేకాకుండా ఫోన్‌ను ఫార్మాట్ చేయడం కూడా అనుమతించదు.

click me!