మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే ఆర్‌బీఐకి తలనొప్పి.. ఎందుకో తెలుసా?

First Published | Oct 20, 2023, 8:27 PM IST

 ఈరోజుల్లో క్రెడిట్ కార్డ్ యూజర్ల సంఖ్య పెరిగింది. మీ బ్యాంక్ అకౌంట్లో  డబ్బు లేకపోయినా మీకు కావలసినది ఏదైనా కొనే  అవకాశాన్ని క్రెడిట్ కార్డ్ అందిస్తుంది. నేటి తరానికి క్రెడిట్ కార్డ్  ఇష్టమైన ఆర్థిక సాధనంగా మారడానికి  కూడా ఇదే కారణం. అయితే ఈ క్రెడిట్ కార్డు వినియోగం ఇటీవలి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి తలనొప్పిగా మారింది. 

మనం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే RBI కి ఎందుకు తలనొప్పి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. దీనికి ఒక కారణం ఉంది. దేశంలో చిన్న వ్యక్తిగత రుణాలు పెరిగినట్లు ఆర్‌బీఐ ఇటీవల గుర్తించింది. ఈ రుణాలలో ఎక్కువ భాగం క్రెడిట్ కార్డ్ లోన్లే. బ్యాంకులకు లేదా ఆర్థిక సంస్థలకు పెద్ద సంఖ్యలో లోన్లు  తిరిగి చెల్లించని వారిపై ఆర్‌బిఐ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే దేశంలో మొండి బకాయిలు (తిరిగి చెల్లించలేని లోన్లు) అధికంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి చెల్లించని క్రెడిట్ కార్డు లోన్ల  మొత్తం పెరగడం ఆర్బీఐకి పెద్ద సవాలుగా మారింది.
 

నిబంధనలను కఠినతరం చేసేందుకు సలహా
బిజినెస్  లేదా పర్సనల్  లోన్లకు  సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. దీని ద్వారా రానున్న రోజుల్లో ఈ విషయంలో కఠిన విధానాలను అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇటీవలి కాలంలో, దేశానికి పెద్ద తలనొప్పి ఏమిటంటే, మొండి బకాయిలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కలిసి  తీసుకున్న కొన్ని చర్యలే ఇందుకు కారణమని చెబుతున్నారు. అయితే వ్యక్తిగత రుణాలు వేగంగా పెరగడంపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. 


ఏ రకమైన వ్యక్తిగత రుణాల కారణంగా క్రెడిట్ కార్డ్ లావాదేవీలు పెరిగాయనే దానిపై ఆర్‌బిఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు . అయితే, గణాంకాలను పరిశీలిస్తే, క్రెడిట్ కార్డులు ఇంకా  చిన్న రుణాల మొత్తంలో పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ సంబంధిత వాటి పై 3-4 నెలల వ్యవధిలో  రూ.10,000  ఖర్చు చేస్తారు. తాజాగా బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఈ ఖర్చులు చాలా వరకు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా జరుగుతున్నాయి. భారతీయుల క్రెడిట్ కార్డ్ ఖర్చు రికార్డు స్థాయిలో పెరిగింది. పండుగల సీజన్‌లో రుణాలు తీసుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

క్రెడిట్ కార్డ్ రికార్డ్.. 
2023 ఆగస్టు నెలలో, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి నిర్వహించిన లావాదేవీలు రూ.1.48 లక్షల కోట్లు. ఈ లావాదేవీ ఆల్ టైమ్ హైలో  ఉంది. జూలైలో 1.45 లక్షల కోట్లు.  ఈ లావాదేవీలు క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగింది. అక్టోబర్ నెలలోనూ పండుగలు ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 
 

Latest Videos

click me!