Published : Oct 16, 2026, 01:07 PM ISTUpdated : Oct 16, 2026, 01:25 PM IST
kitchen gadgets: రోజువారీ వంటగది పనులు అంటే చాలా మందికి కష్టమైన పనే. ముఖ్యంగా పనిచేసే మహిళలకు (Working Women) వంట సమయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. వంటగది పనులను చిటికెలో పూర్తి చేయడానికి కొన్ని ఆధునిక గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం.
ఇది వంటగదిలో అత్యంత ఉపయోగకరమైన గ్యాడ్జెట్లలో ఒకటి. దీనిని కేటిల్ లాగా నీళ్లు మరిగించుకోవడానికి ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఇందులో ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు, గుడ్లు ఉడకబెట్టుకోవచ్చు, మ్యాగీ లేదా కొద్దిపాటి అన్నం కూడా వండుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. కేవలం 5 నిమిషాల్లో గుడ్లు ఉడికిపోవడం దీని ప్రత్యేకత. ఈ మల్టీ కుక్కర్ ఆన్ లైన్ లో 800 నుంచి దొరుకుతుంది.
ఎండాకాలంలో మజ్జిగ లేదా తాజా జ్యూస్‌లు తయారు చేసుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కావలసిన పదార్థాలు, పెరుగు, నీరు, తగినంత ఉప్పు లేదా పుదీనా, అల్లం వేసుకుని బాగా షేక్ చేయవచ్చు. ఇది ఎయిర్-లాక్ సిస్టమ్‌తో వస్తుంది కాబట్టి పొరపాటున కింద పడిపోయినా నీరు బయటకు రాదు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా దీన్ని సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు. ఈ మిల్క్ షేకర్ ఆన్ లైన్ లో దొరుకుతుంది.. 300 రూపాయల నుంచి అందుబాటులో ఉంది.
గ్రేటర్ కమ్ స్టోరేజ్ బాక్స్ (Greater with Storage Box)
కూరగాయలు లేదా కొబ్బరి తురుముకోవడానికి సాధారణ గ్రేటర్లు వాడతాం, కానీ తురిమిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి మార్చాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రేటర్‌కు కిందనే ఒక స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. క్యారెట్ లేదా కొబ్బరి తురుముకున్నాక నేరుగా మూతపెట్టి ఫ్రిడ్జ్‌లో భద్రపరుచుకోవచ్చు. ఇది ఎయిర్ టైట్ కనుక ఆహారం ఎక్కువ కాలం తాజా ఉంటుంది. ఈ గ్రేటర్ కమ్ స్టోరేజ్ బాక్స్ లు రకరకాల ధరలలో ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. 200 నుంచి మొదలై.. అందులో ఫీచర్స్ ను బట్టి రేట్లు పెరుగుతుంటాయి
ఇది మల్టీపర్పస్ మిషన్‌గా పనిచేస్తుంది. దీని సహాయంతో కేవలం 5 నిమిషాల్లో సులభంగా మీగడ నుంచి వెన్న తీసుకోవచ్చు. అలాగే ఎగ్స్ బీట్ చేసుకోవడానికి, పిండి కలుపుకోవడానికి , కూరగాయలను చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిక్ విధానం ద్వారా వంటపనులు మరింత వేగంగా పూర్తవుతాయి. ఈ మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ బ్లెండర్ కమ్ చాపర్ 1000 రూపాయల ధరలో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. మరిన్ని ఫీచర్స్ తో కావాలన్నీ ఆప్షన్స్ చూసుకోవచ్చు.