గూగుల్ ఫోన్ యాప్ లో కొత్త అప్ డేట్ తర్వాత మీ ఫోన్‌కు డిఫాల్ట్‌గా వచ్చే ఫోన్ యాప్ ట్రూకాలర్ లాగా పనిచేస్తుంది. గూగుల్ చాలా కాలంగా గూగుల్ ఫోన్ యాప్‌లోని స్పామ్ ఫీచర్‌పై పనిచేస్తోంది, చివరకు ఇప్పుడు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. గూగుల్ ఫోన్ యాప్ సెట్టింగ్‌లకు వెళ్లి కాలర్ ఐడి ఆన్ చేయాలి. ఆ తరువాత ఏదైనా ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఫోన్ స్వయంగా ఎవరి నుంచి ఫోన్ వచ్చిందో తెలియజేస్తుంది.
undefined
ఈ ఫీచర్ కోసం మీకు మూడు ఆప్షన్స్ లభిస్తాయి. ఏమిటంటే మీరు హెడ్‌ఫోన్స్ ఉపయోగించినప్పుడు ఫోన్ ఎవరి ఫోన్ ద్వారా వచ్చింది మీకు తెలియజేస్తుంది. అంతేకాకుండా మీరు ఈ ఫీచర్ ని అప్పుడైనా ఆపివేయవచ్చు. దీని ప్రయోజనం ఏమిటంటే మీ సౌలభ్యం ప్రకారం మీరు కాల్స్ అందుకుంటారు.
undefined
మీరు ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఈ యాప్ ముందే దానిలో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో మీరు గూగుల్ - కాలర్ ఐడి & స్పామ్ ప్రొటెక్షన్ పేరుతో ఈ యాప్ కోసం సెర్చ్ చేయవచ్చు. ఇప్పటివరకు 500 మిలియన్లకు పైగా ప్రజలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తరువాత, గూగుల్ ఫోన్ యాప్ ట్రూ కలర్ వంటి యాప్స్ తో ప్రత్యక్ష పోటీగా నిలుస్తుంది.
undefined