డౌన్‌డెటెక్టర్ ప్రకారం డిసెంబర్ 1 ఉదయం 7 గంటల నుండి గూగుల్ సర్వీస్ సమస్య తలెత్తింది. ఇప్పటి వరకు 250 మందికి పైగా డౌన్‌డిటెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సెర్చ్, లాగిన్ అండ్ సైట్‌లో వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారు.
గూగుల్ సెర్చ్ లో లోపం
క్రోమ్ లేదా మరేదైనా బ్రౌజర్‌లో గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ సాధారణ సమయం కంటే పేజ్ లోడ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాసేపటి తర్వాత వినియోగదారులు ఎర్రర్ మెసేజ్ అందుకుంటున్నారు. ఈ అంతరాయంపై గూగుల్ ఇంజనీర్లు సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని గూగుల్ తెలిపింది. అయితే ఇంటర్నల్ సర్వర్ సమస్య కారణంగా ఈ సమస్య ఎదురైనట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.
ఇంతకుముందు కూడా ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లు ట్వీటర్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ కూడా 3 నెలల వ్యవధిలో డౌన్ అయ్యాయి.
పరాగ్ అగర్వాల్ ట్విటర్ కొత్త బాస్ సిఈఓ అయిన వెంటనే యాక్షన్ లోకి దిగారు. వ్యక్తిగత సమాచార పరిరక్షణ విధానానికి మంగళవారం కొత్త అప్‌డేట్ చేసింది, తద్వారా ఒకరి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయడానికి ఇతరులను అనుమతించబడదు. ప్రైవేట్ మీడియాలో ఫోటోలు ఇంకా వీడియోలను చేర్చడానికి కంపెనీ ఇప్పుడు వ్యక్తిగత సమాచార విధానం(personal information policy) పరిధిని విస్తరిస్తున్నట్లు కంపెనీ బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది.
ఇప్పటి వరకు ఏ యూజర్ అయినా ఒకరి అనుమతి లేకుండా ఇతర యూజర్ల వీడియోలు, ఫోటోలను షేర్ చేయడానికి వీలుండేది. ఫోటోలు, వీడియోలకు సంబంధించి కంపెనీ తీసుకున్న నిర్ణయం వేధింపుల నిరోధక విధానాలను(anti-harrasment policy) మరింత బలోపేతం చేయడం అలాగే మహిళా వినియోగదారులను సురక్షితంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం
ట్విట్టర్ "ఫోటోలు లేదా వీడియోల వంటి పర్సనల్ మీడియాను షేర్ చేయడం అనేది ఒక వ్యక్తి గోప్యతకు భంగం కలిగించవచ్చు అలాగే మానసిక లేదా శారీరక హానిని కూడా కలిగిస్తుంది." అని తెలిపింది.
సోషల్ మీడియా సంస్థ వినియోగదారులు వారి చిరునామా లేదా లొకేషన్, గుర్తింపు పత్రాలు, నాన్-పబ్లిక్ కాంటాక్ట్ సమాచారం, ఫైనాన్షియల్ సమాచారం లేదా మెడికల్ డేటా వంటి ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండా ఇప్పటికే నిషేధించింది.
కొత్త నిబంధనలు ఎందుకు అమలు చేశారు
"వ్యక్తిగత మీడియా దుర్వినియోగం ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది, అయితే ఇది మహిళలు, మైనారిటీ వర్గాల సభ్యులను కూడా ప్రభావితం చేస్తుంది" అని కంపెనీ తెలిపింది. ట్విట్టర్‌లో పోస్ట్ చేయడానికి ముందు ఫోటో లేదా వీడియోకు అందని అనుమతి అవసరమని దీని అర్థం, అయితే ఎవరైనా వాటిని తీసివేయాలని లేదా రిపోర్ట్ చేస్తే ట్విట్టర్ దానిని నిషేధిస్తుంది.