అవును, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు త్వరలో ఒక డివైజ్ లో రెండు WhatsApp అకౌంట్స్ ఉపయోగించగలరు. ఈ విషయాన్ని వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రకటించారు.
“ఈ రోజు, మేము ఒకేసారి రెండు WhatsApp అకౌంటలకు లాగిన్ చేసే ఫీచర్ పరిచయం చేస్తున్నాము. దీని ద్వారా మీ వర్క్ అండ్ వ్యక్తిగత అకౌంట్స్ మధ్య మారడానికి సహాయపడుతుంది. "కాబట్టి మీరు ఇకపై ప్రతిసారీ లాగ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, రెండు ఫోన్‌లను వాడటం లేదా మెసేజెస్ పంపడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని మార్క్ జుకర్‌బర్గ్ తన పోస్ట్‌లో తెలిపారు.
ఈ ఫీచర్ ఎలా సహాయపడుతుంది
ఈ ఫీచర్ యూజర్లను ఇంకో ఫోన్ వాడకుండా లేదా అకౌంట్స్ మార్చడానికి లాగ్ అవుట్ కాకూండా సేవ్ చేస్తుంది. WhatsApp అకౌంట్ స్విచ్చింగ్ ఫీచర్ కస్టమర్ల మల్టీ అకౌంట్స్ మ్యానేజ్ సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉదాహరణకు, వినియోగదారులు వర్క్ కోసం అండ్ ఫ్రెండ్స్ అలాగే కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపడం కోసం వేర్వేరు WhatsApp అకౌంట్స్ ఉంటే, ఈ ఫీచర్ ఒకే డివైజ్ లో అకౌంట్స్ మధ్య ఈజీగా మారడానికి సహాయపడుతుంది.
వినియోగదారులు రెండవ అకౌంట్ సెటప్ చేయాలనుకుంటే వారికి ప్రత్యేక ఫోన్ నంబర్ అండ్ SIM కార్డ్ అవసరం అని కంపెనీ తెలిపింది. అంటే ఈ ఫీచర్ డ్యూయల్ సిమ్ ఫోన్‌లలో మాత్రమే పని చేస్తుంది.
అలాగే, వన్-టైమ్ పాస్‌కోడ్‌ను పొందడానికి వినియోగదారులకు సెకండరీ డివైజ్ లేదా ప్రత్యామ్నాయ SIM కార్డ్ అవసరం. వినియోగదారులు రెండవ అకౌంట్ వేరే డివైజ్ లో యాక్సెస్ చేయడానికి అనుమతించడానికి WhatsApp ఈ కోడ్‌లను SMS ద్వారా పంపుతుంది.
అలాగే, వాట్సాప్ ప్రతినిధి ఎల్లీ హీట్రిక్ మాట్లాడుతూ ప్రాథమిక వెరిఫికేషన్ తర్వాత, యాప్ సెకండ్ డివైజ్ లేదా సిమ్ లేకుండా రెండు అకౌంట్లకు పని చేస్తుంది.