గేమింగ్ స్పెషల్.. బిగ్ బ్యాటరీ.. తక్కువ ధరకే శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఏంటంటే ?

First Published | Oct 25, 2023, 9:13 PM IST

మీరు తక్కువ ధరకే సరికొత్త ఫీచర్లతో అత్యంత బడ్జెట్  స్మార్ట్‌ఫోన్‌ కొనాలని  చూస్తున్నారా.. అయితే మీకు ఎలక్ట్రానిక్స్  దిగ్గజం Samsung నుండి వస్తున్న ఈ ఫోన్ బెస్ట్  అప్షన్. శాంసంగ్ ఏ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్  చేసింది.
 

అదే Samsung Galaxy A05s. పవర్ ఫుల్ ప్రాసెసర్, కెమెరా ఇంకా  ఇతర ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్‌కు అనుకూలమైనది. 6GB ర్యాం  + 128GB స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999. దీనిని Samsung అఫీషియల్  వెబ్‌సైట్ నుండి సొంతం  చేసుకోవచ్చు.
 

కొత్తగా ప్రవేశపెట్టిన ఆఫర్ ప్రకారం, SBI క్రెడిట్ కార్డ్ అండ్ EMIపై రూ.1000 తగ్గింపు లభిస్తుంది. దీనికి  50MP ప్రైమరీ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. కంపెనీ దీనిని సింగిల్ బిల్డ్‌లో ప్రవేశపెట్టింది.
 


ఇంకా 2MP మాక్రో లెన్స్,  2MP డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్  కెమెరా కోసం, కంపెనీ 13MP సెల్ఫీ కెమెరాను అందించింది. Samsung Galaxy A05s లైట్ గ్రీన్, లైట్ పర్పుల్,  బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. స్క్రీన్ సైజ్ దాదాపు 6.7 అంగుళాలు.
 

సెక్యూరిటీ కోసం  సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌  కూడా ఉంది. ఇందులో డ్యూయల్ సిమ్ సౌకర్యం ఇచ్చారు. మరిన్ని   ఇతర ఫీచర్లలో 4G, Wi-Fi, బ్లూటూత్, 3.5mm జాక్,  డాల్బీ అట్మోస్ ఉన్నాయి.
 

Latest Videos

click me!