ఫ్రీ వై-ఫై: ఇంటర్నెట్ డాటా అయిపోయిందా.. ఈ విధంగా నిమిషాల్లో కనెక్ట్..

First Published | Jan 20, 2022, 10:41 AM IST

ఈ రోజుల్లో చాలా పనులు ఆన్‌లైన్‌లో మోడ్ ని ప్రారంభించాయి, దీనికి ఇంటర్నెట్ అవసరం. అయితే ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడి మొబైల్‌లో ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉంటుంది.

 కొన్నిసార్లు  డేటా  సేవ్ చేయడానికి లేదా డాటా అయిపోతే  ఉచిత  వై-ఫై (Wi-Fi) కోసం చూస్తుంటారు. అయితే ఇప్పుడు చాలా బహిరంగ ప్రదేశాల్లో ఉచిత  వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంది. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం చాలా రైల్వే స్టేషన్లలో ఉచిత  వై-ఫై సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతో  రైల్వే స్టేషన్లలో ఫ్రీ  వై-ఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 

ఒక్కోసారి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చిన లేదా రైలు  రావడానికి సమయం ఉన్న చాలా మంది ఆన్‌లైన్‌లో ఏదో ఒక వీడియో, సోషల్ మీడియా, షాపింగ్ కోసం బ్రౌస్ చేయడానికి ఇష్టపడతారు. ఇందుకు స్టేషన్‌లో అందుబాటులో ఉన్న ఉచిత Wi-Fiని ప్రజలు ఉపయోగించాలనుకుంటుంటారు, కానీ ఎలా కనెక్ట్ చేయాలో కొందరికి  తెలియదు. కాబట్టి మీరు రైల్వే స్టేషన్‌లో ఉచితంగా ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం...   

Latest Videos


ఉచిత వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి ?
దీని కోసం మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో Wi-Fi సెట్టింగ్‌ని ఓపెన్ చేసి  రైల్వే నెట్‌వర్క్ సిగ్నల్ కోసం చూడండి 

తరువాత Railwire నెట్‌వర్క్‌ని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ బ్రౌజర్‌లో railwire.co.in వెబ్‌పేజీని తెరవండి. దీని తర్వాత ఇప్పుడు మీరు మీ 10 నంబర్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. 

అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. RailWireని కనెక్ట్ చేయడానికి ఈ OTPని పాస్‌వర్డ్‌గా ఉపయోగించండి. 

దీని తర్వాత మీరు విజయవంతంగా RailWireకి కనెక్ట్ చేయబడతారు. అలాగే ఉచితంగా ఇంటర్నెట్‌ను సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.  

click me!