ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. రీల్స్ పోస్ట్ చేసినందుకు రూ.7.4 లక్షల బోనస్..

First Published | Nov 13, 2021, 1:00 PM IST

న్యూఢిల్లీ: మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రీల్స్‌(reels)ను పోస్ట్ చేసినందుకు కంటెంట్ క్రియేటర్స్ కి ఇన్‌స్టాగ్రామ్(instagram) 10,000 డాలర్లు అంటే సుమారు రూ. 7.4 లక్షల వరకు బోనస్‌ చెల్లిస్తుంది అని ఒక నివేదిక పేర్కొంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వీడియోలను పోస్ట్ చేసే క్రియేటర్‌లను యాప్‌లోకి తీసుకురావడానికి ఈ బోనస్ సహాయపడుతుందని భావిస్తున్నారు. 
 

నివేదిక ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని క్రియేటర్‌లు ఇప్పుడు రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్‌లో భాగంగా "రీల్స్" అని పిలిచే షార్ట్ వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా 10,000 డాలర్లు వరకు సంపాదించే అవకాశాన్ని పొందువచ్చు.

అయితే రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రామ్‌లో భాగంగా రీల్స్‌ను క్రియేట్ చేయడం ద్వారా క్రియేటర్‌లు బోనస్ డబ్బును ఎలా సంపాదించవచ్చో ఇన్‌స్టాగ్రామ్ స్పష్టంగా చెప్పలేదు అని ఒక నివేదిక ఈ విషయాన్ని ఎత్తి చూపింది. 
 

50,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న కంటెంట్  క్రీయేటర్స్ ఒక నెలలో 1,000  డాలర్లు సుమారు 75 వేల వరకు సంపాదించారని మీడియా నివేదికలు హైలైట్ చేశాయి. మరోవైపు అదే  మొత్తం ఉన్న ఫాలోవర్స్ కి $600 మాత్రమే సంపాదించారు. అందువల్ల ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు బోనస్‌లను ఎలా చెల్లిస్తుందో అస్పష్టంగా ఉంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లోని ఇతర క్రియేటర్స్ ఒక నెలలో పోస్ట్ చేసిన అన్ని రీల్స్‌లో 1.7 మిలియన్ల వ్యూస్ చేరుకోవడం ద్వారా $800 సంపాదించినట్లు చెప్పారు.

Latest Videos


ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం బోనస్ ప్రోగ్రామ్ తక్కువ మంది క్రియేటర్‌లతో టెస్టింగ్ చేస్తుంది. భవిష్యత్తులో బోనస్‌లు మరింత పర్సనలైజ్ చేయబడతాయని కంపెనీ పేర్కొంటున్నట్లు  ఒక నివేదిక నివేదించింది.

ఇన్‌స్టాగ్రామ్ నెమ్మదిగా ఈ బోనస్‌లను విడుదల చేస్తోంది, ఇవి ఇంకా పూర్తిగా వినియోగదారులందరికీ అందుబాటులో లేవు. అంటే యూ‌ఎస్ లోని ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్ మాత్రమే ఈ బోనస్‌లను పొందగలరు. సోషల్ మీడియా సంస్థ  ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో లేదా ఇతర ముఖ్యమైన మార్కెట్‌లలో బోనస్ ప్రోగ్రామ్‌ను ఇంకా విడుదల చేయలేదు. 

click me!