జియో, ఎయిర్‌టెల్‌ బాటలో ఇప్పుడు వోడాఫోన్.. రీఛార్జ్ ప్లాన్స్ ధర పెంపు.. షాక్‌లో కస్టమర్లు!

First Published | Jun 29, 2024, 12:34 PM IST

టెలికం కంపెనీ వోడాఫోన్ Vodafone Idea (Vi)   ప్రీపెయిడ్ & పోస్ట్-పెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్లు  జూలై 04 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ తర్వాత టారిఫ్‌  ధరలను పెంచిన మూడవ టెలికాం ఆపరేటర్‌ వోడాఫోన్ ఐడియా.
 

అయితే Vi క్యాటగిరి టారిఫ్‌లను 11-24% పెంచింది. 4G అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి ఇంకా 5G సేవలను ప్రారంభించేందుకు రాబోయే కొద్ది నెలల్లో భారీ పెట్టుబడులను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఉన్న అన్ని టచ్ పాయింట్‌లు,  ఛానెల్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.
 

28 రోజుల వొడాఫోన్ ఐడియా  ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ప్లాన్  కనీస ధర రూ.179 నుంచి రూ.199కి అంటే దాదాపు 11 శాతం పెంచింది.   1.5GB డేటాతో VI  పాపులర్  84-రోజుల వాలిడిటీ  ప్లాన్ ధరను రూ.719 నుండి రూ.859 పెంచింది. కంపెనీ  అన్యువల్  ఆన్ లిమిటెడ్  ప్లాన్ ధరను రూ. 2,899 నుండి రూ. 3,499కి అంటే  దాదాపు 21 శాతం పెంచింది.
 


24GB డేటాతో 365 వాలిడిటీ ప్లాన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు, దీని ధర రూ. 1,799.  ప్రీపెయిడ్ కస్టమర్‌లకు 'హీరో అన్‌లిమిటెడ్' ప్లాన్‌లతో ఉచిత నైట్ డేటా, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ అండ్  పోస్ట్-పెయిడ్ కస్టమర్‌లకు ప్రత్యేకమైన 'చుజ్ యువర్ బెనిఫిట్' ఆప్షన్‌తో సాటిలేని ప్రయోజనాలను అందించే ఏకైక ఆపరేటర్ Vi మాత్రమే.
 

ఆన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్‌లలో ఎయిర్‌టెల్  దాదాపు 11 శాతం టారిఫ్‌ ధరలను పెంచింది, అంటే టారిఫ్‌ ధరలను రూ.179 నుండి రూ.199కి సవరించింది. రూ.455 ప్లాన్ ధరను రూ.509కి, రూ.1,799 ప్లాన్ ధరను రూ.1,999కి పెంచేసింది. డైలీ డేటా ప్లాన్ విభాగంలో 56 రోజుల వ్యాలిడిటీ,  1.5 GB/dayగల  రూ.479 ప్లాన్ రూ.579కి (20.8 శాతం పెంపు) పెరిగింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ జూలై 3 నుండి మొబైల్ సర్వీస్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.
 

Latest Videos

click me!