అమెజాన్ కి పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: స్మార్ట్‌ఫోన్‌ల నుండి టీవీల వరకు గొప్ప ఆఫర్‌లు ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Jan 14, 2022, 12:40 PM IST

మీరు కూడా స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేందుకు సేల్ కోసం ఎదురు చూస్తున్నారా... అయితే ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)బిగ్ సేవింగ్ డేస్ సేల్  తీసుకొస్తుంది. ఈ సెల్ జనవరి 17 నుండి ప్రారంభమమై  22 వరకు కొనసాగుతుంది.

PREV
14
అమెజాన్ కి పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: స్మార్ట్‌ఫోన్‌ల నుండి టీవీల వరకు గొప్ప ఆఫర్‌లు ఇవే..

ఫ్లిప్‌కార్ట్‌  ఈ సేల్‌లో మీరు స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్ టీవీలు ఇతర గాడ్జెట్‌ల వరకు భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ సెల్‌లో మీరు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కూడా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ సెల్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం...

24

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ జనవరి 16 రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌  ఈ సేల్‌లో, ఆపిల్, రియల్ మీ, పోకో, స్యామ్సంగ్ వంటి కంపెనీల ఫోన్‌లపై 80 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు వంటి స్మార్ట్ వెరబుల్ ఉత్పత్తులపై 60 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇంకా ల్యాప్‌టాప్‌లపై  40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
 

34

స్మార్ట్ టీవీలపై 75 శాతం తగ్గింపు
 ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై  75 శాతం తగ్గింపుతో కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.  బ్లాపంక్ట్ (Blaupunkt), కొడాక్ (Kodak), థామ్సన్ (Thomson) వంటి కంపెనీలు ఈ సేల్‌లో వాటి స్మార్ట్ టీవీపై ఆఫర్లను ప్రకటించాయి. ఈ సెల్‌లో Blaupunkt 32-అంగుళాల స్మార్ట్ టీవీని రూ.12,499కి కొనుగోలు చేయవచ్చు, అయితే దీని ఎం‌ఆర్‌పి ధర రూ.14,499. అంతేకాకుండా, బ్లాపంక్ట్  42, 43, 50, 55 ఇంకా 65-అంగుళాల టీవీలను కూడా రూ.4,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
 

44

థామ్సన్ స్మార్ట్, నాన్-స్మార్ట్ టీవీలను కూడా ఈ సేల్‌లో డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. థామ్సన్  24-అంగుళాల నాన్-స్మార్ట్ టీవీని రూ. 500 తగ్గింపుతో రూ.7,499కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కంపెనీ స్మార్ట్ టీవీలను రూ. 4,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ OATHPRO సిరీస్‌పై కూడా భారీ తగ్గింపులు ఉంటాయి. వెస్టింగ్‌హౌస్(Westinghouse) టీవీలు కూడా ఈ సేల్‌లో రూ.2,000 వరకు తగ్గింపును పొందుతాయి.

click me!

Recommended Stories