హై-స్పీడ్ డేటాతో బి‌ఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌లు.. కేవలం రూ. 184కే ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..

First Published Jan 13, 2022, 10:48 PM IST

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఏకకాలంలో నాలుగు కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌(prepaid plans)లను ప్రవేశపెట్టింది. బి‌ఎస్‌ఎన్‌ఎల్  ఈ ప్లాన్‌ల ధరలు రూ. 184, రూ. 185, రూ. 186 ఇంకా రూ. 347. ఈ ప్లాన్‌లతో కస్టమర్‌లు ఆన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్‌ఎం‌ఎస్ లతో పాటు హై-స్పీడ్ డేటాను పొందుతారు. 

బి‌ఎస్‌ఎన్‌ఎల్  ఈ ప్లాన్‌లు ప్రత్యేక టారిఫ్ వోచర్‌ల (STVs) క్రింద ప్రవేశపెట్టింది. అయితే ఒక ఇంగ్లిష్ వెబ్ సైట్ మొదట ఈ బి‌ఎస్‌ఎన్‌ఎల్  ప్లాన్‌ల గురించి సమాచారాన్ని అందించింది.


ఇప్పుడు ఈ ప్లాన్ల బెనెఫిట్స్ గురించి చెప్పాలంటే రూ. 184 ప్లాన్‌తో మీరు అన్ని నెట్‌వర్క్‌లకు  ప్రతిరోజూ ఆన్ లిమిటెడ్ కాలింగ్, 1 జి‌బి డేటా పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా లభిస్తాయి.

రూ.185 ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఈ ప్లాన్‌లో కూడా అన్ని నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్  లోకల్, ఎస్‌టి‌డి కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో కూడా ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ ల సౌకర్యం లభిస్తుంది. ఇందులో అరేనా(arena) మొబైల్ గేమింగ్ సర్వీస్ కూడా 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

ఇప్పుడు రూ.186 ప్లాన్ ప్రయోజనాల విషయానికొస్తే ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇందులో కూడా ప్రతిరోజూ 1జి‌బి డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌తో హార్డీ గేమ్ సర్వీస్ లభిస్తుంది. బి‌ఎస్‌ఎన్‌ఎల్ రూ. 347 కూడా రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లతో 2 జి‌బి డేటాను వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఇందులో కూడా అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్ 56 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది.

ఏ ఇతర నెట్‌వర్క్ నుండి అయినా బి‌ఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు వచ్చే కస్టమర్లకు 5జి‌బి డేటా ఉచితంగా లభిస్తుందని  ఇటీవల తెలిపింది. ఈ ఉచిత డేటా  వాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఉచిత డేటా కోసం ఒక షరతు ఏమిటంటే, మీరు సోషల్ మీడియాలో బి‌ఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో ఎం‌ఎన్‌పి చేయడానికి కారణాన్ని తెలియజేయాలి అలాగే దీనికి సంబంధించిన రుజువును కంపెనీకి పంపాలి.
 
బి‌ఎస్‌ఎన్‌ఎల్  కొత్త ఫ్రీ డేటా ఆఫర్ 15 జనవరి 2022 వరకు ఉంటుంది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్వీట్‌ ద్వారా తెలియజేసింది. ఎం‌ఎన్‌పి పూర్తయిన తర్వాత వినియోగదారులు #SwitchToBSNLతో Twitter ఇంకా Facebookలో పోస్ట్ చేయాలి. దీనితో పాటు, బి‌ఎస్‌ఎన్‌ఎల్ ను కూడా ట్యాగ్ చేసి అనుసరించాల్సి ఉంటుంది.

click me!