20 వేలలో 5000mAh బ్యాటరీతో వస్తున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ప్రారంభ ధర రూ. 9490..

First Published | Nov 10, 2021, 1:58 PM IST

 స్మార్ట్ ఫోన్ మార్కెట్ చాలా వేగంగా మారుతోంది. కొత్త ఫీచర్లు, ప్రత్యేకతలతో ప్రతివారం కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లు (smartphones)విడుదల అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లను ప్రజలు ఇప్పుడు 4కే వీడియో రికార్డింగ్ కోసం ప్రజలు ఉపయోగిస్తున్నారు, అయితే ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లపై ఖర్చు చేయడం చాలా తక్కువ. 

 రూ.15-20 వేల సెగ్మెంట్ ఎవర్ గ్రీన్. ఈ విభాగంలో అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవుతున్నాయి. ఈ నివేదికలో రూ. 20,000 వరకు ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌ల గురించి  మీకు కోసం. ఈ ఫోన్‌లు 5000mAh బ్యాటరీతో వస్తున్నాయి.
 

రెడ్ మీ నోట్ 10S - ప్రారంభ ధర రూ. 14,999
రెడ్ మీ నోట్ 10Sలో అండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 ఉంది. అంతేకాకుండా 6.43-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఫోన్‌లో MediaTek Helio G95 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం Mail-G76 MC4 GPU, 8జి‌బి  వరకు LPDDR4X ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ ఉంది. అలాగే నాలుగు వెనుక కెమెరాలు ఇచ్చారు, దీని మొదటి లెన్స్ 64 మెగాపిక్సెల్స్.  5000mAh బ్యాటరీ ఉంది, ఇంకా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, ఛార్జర్ ఫోన్‌తో బాక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ వాటర్ ప్రూఫ్ కోసం ఐ‌పి53 రేటింగ్ పొందింది.

Latest Videos


రియాల్ మీ 8s - ప్రారంభ ధర రూ. 17,999
ఈ ఫోన్ 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది, దీని రిజల్యూషన్ 1080x2400 పిక్సెల్‌లు. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz, బ్రైట్ నెస్ 600 నిట్స్. ఫోన్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో 5 జి‌బి వర్చువల్ ర్యామ్, 8జి‌బి LPDDR4x ర్యామ్‌  ఉంది. కెమెరా గురించి మాట్లాడితే  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS/A-GPS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అంతేకాకుండా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. 33W డర్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ఉంది.

లావా అగ్ని 5జి - ప్రారంభ ధర రూ. 19,999
లావా అగ్ని 5జిలో  6.78-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. లావా ఈ ఫోన్‌లో నాలుగు వెనుక కెమెరాలు ఇచ్చింది. దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌ ఎపర్చరు f/1.79 ఉంది. రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్. మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ అండ్ నాల్గవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. లావా అగ్ని 5జి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 90 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని చెబుతున్నారు.

వివో వై3s - ప్రారంభ ధర రూ. 9,490
ఈ కొత్త వివో ఫోన్ 6.51 అంగుళాల హెచ్‌డి ప్లస్ హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లే ఉంది. దీనిలో MediaTek Helio Helio P35 ప్రాసెసర్, 2 జి‌బి ర్యామ్, 32 జి‌బి స్టోరేజీని మెమరీ కార్డ్ సహాయంతో విస్తరించుకోవచ్చు. వెనుక ప్యానెల్‌లో 13 మెగాపిక్సెల్‌లు, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్‌ల సింగిల్ కెమెరా ఉంది. ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

వివో వై53s - ప్రారంభ ధర రూ. 19,490
 వివో వై53s 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 60Hz. అంతేకాకుండా ఫోన్‌లో MediaTek Helio G80 ప్రాసెసర్, 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ ఉంది.కెమెరా గురించి మాట్లాడితే  వివో వై53s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌లు. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఉంది.

click me!