ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లలో కొత్త బ్రాండింగ్.. అసలు మెటావర్స్ అంటే ఏంటి ?

First Published Nov 6, 2021, 11:58 AM IST

సోషల్ మీడియా దిగ్గజం, ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ (facebook)గత వారం  కొత్త పేరును ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు కంపెనీ  కొత్త పేరు మెటా ( Meta) బ్రాండింగ్  వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ , ఫేస్‌బుక్ యాప్‌లలో కనిపించడం ప్రారంభించింది. 

ఫేస్‌బుక్ బ్రాండింగ్ ఉన్న అన్ని ఫేస్‌బుక్ యాప్‌ల క్రింద  ఇప్పుడు మెటా ( Meta) బ్రాండింగ్ చూడవచ్చు. ఫేస్‌బుక్  కొత్త పేరును ప్రకటిస్తూ ప్రపంచం దానిని కేవలం సోషల్ మీడియా కంపెనీగా కాకుండా మెటావర్స్‌గా తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

ఫేస్‌బుక్‌తో పాటు మైక్రోసాఫ్ట్, ఐబిఎమ్ వంటి కంపెనీలు కూడా  మెటావర్స్‌పై పనిచేస్తున్నాయి. మెటా బ్రాండింగ్ మొదట ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వాట్సప్  బీటా వెర్షన్‌లలో కనిపించింది. ఆ తర్వాత ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్‌లలో కూడా మెటా బ్రాండింగ్ చూడవచ్చు.

అయితే కొత్త బ్రాండింగ్‌తో పాటు ఫేస్‌బుక్ యాప్ ఫీచర్లలో ఏమైనా కొత్త మార్పు ఉంటుందా అనే దానిపై  ఇంకా స్పష్టంగా తెలియలేదు. 2019 సంవత్సరంలో ఫేస్‌బుక్ బ్రాండింగ్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ తో అనుబంధించబడింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తర్వాత ఈ బ్రాండింగ్ జరిగింది.

మెటావర్స్ (Metaverse) అంటే ఏమిటి?
మెటావర్స్ ఈ రోజు అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చి ఉండవచ్చు, కానీ మెటా వర్స్ చాలా పాత పదం. దీనిని నీల్ స్టీఫెన్‌సన్ 1992లో తన డిస్టోపియన్ నవల "స్నో క్రాష్"లో పేర్కొన్నాడు. స్టీఫెన్‌సన్ నవలలో మెటావర్స్ అంటే హెడ్‌ఫోన్‌లు, వర్చువల్ రియాలిటీ వంటి గాడ్జెట్‌ల సహాయంతో గేమ్‌లోని డిజిటల్ ప్రపంచంతో కనెక్ట్ అయ్యే ప్రపంచం.

మెటావర్స్  Metaverse ఇప్పటికే గేమింగ్ కోసం కూడా ఉపయోగించబడుతోంది. క్రిప్టోకరెన్సీలు మెటావర్స్‌లో ఉపయోగించబడతాయి. చెప్పాలంటే మెటావర్స్ Metaverse అనేది ఇంటర్నెట్ యొక్క కొత్త ప్రపంచం, ఇక్కడ మనుషులు ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఉంటారు, అయితే Metaverse పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.

click me!