ఫెయిర్‌ఫోన్ 4 పేరుతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ తాజాగా విడుదలైంది, అయితే ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, మన్నికైన ఫోన్‌గా పేర్కొనబడింది. ఫెయిర్‌ఫోన్ 4తో ఐదు సంవత్సరాల వారంటీ కూడా అందిస్తుంది. కానీ సాధారణంగా ఏదైనా ఒక ఫోన్ పై గరిష్టంగా ఒక సంవత్సరం వారంటీ మాత్రమే వస్తుంది.
ఫెయిర్‌ఫోన్ 4 ధర
ఫెయిర్‌ఫోన్ 4 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ ధర 579 యూరో అంటే సుమారు రూ. 49,800, 8జిబి ర్యామ్ తో 256జిబి స్టోరేజ్ ధర 649 యూరో అంటే దాదాపు రూ. 55,845. ఫెయిర్‌ఫోన్ 4ని అక్టోబర్ 25 నుండి ఫెయిర్‌ఫోన్ వెబ్‌సైట్ ద్వారా విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను ఐదు సంవత్సరాల వారంటీతో గ్రే, గ్నీన్, స్పెక్ల్డ్ గ్రీన్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే భారతదేశంలో ఈ ఫోన్ లభ్యత గురించి సమాచారం లేదు.
ఫెయిర్‌ఫోన్ 4 స్పెసిఫికేషన్స్
ఫెయిర్‌ఫోన్ 4 లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇచ్చారు. అంతేకాకుండా 2025 నాటికి ఈ ఫోన్ ఆండ్రాయిడ్ కి సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను పొందుతుంది. 6.3-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ ఐపిఎస్ డిస్‌ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లే ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 750జి 5జి ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 619 జిపియూ, 8జిబి ర్యామ్ 256 జిబి స్టోరేజ్ ఆప్షన్ ఉంది. దీనిని మెమరీ కార్డ్ సహాయంతో 2టిబి వరకు పెంచుకోవచ్చు.
ఫెయిర్‌ఫోన్ 4 కెమెరా
ఫెయిర్‌ఫోన్ 4లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX582 సెన్సార్ ఎపర్చరు f/1.6, దీనికి 8xడిజిటల్ జూమ్ లభిస్తుంది. రెండవ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, సెల్ఫీ కోసం ఫోన్‌లో 25 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీనితో 8xజూమ్ ఉంటుంది. సాధారణంగా సెల్ఫీ కెమెరాలో జూమ్ ఆప్షన్ ఉండదు.
ఫెయిర్‌ఫోన్ 4 బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, 5జి, 4జి ఎల్‌టిఈ, బ్లూటూత్ వి5.1, ఎన్‌ఎఫ్‌సి, యూఎస్‌బి టైప్-సి పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. వాటర్ రిసిస్టంట్ కోసం ఐపి54 రేటింగ్ పొందింది. దీనికి 3905mAh రిమూవబుల్ బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.