2012లో టైమ్ మ్యాగజైన్ ఆమెని ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. ఫార్చ్యూన్ అండ్ ఫోర్బ్స్ వంటి మ్యాగజైన్‌లు కూడా ఆమెని ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో చేర్చాయి. 2013లో ఆమె పుస్తకం 'లీన్ ఇన్: ఉమెన్, వర్క్ అండ్ ది విల్ టు లీడ్' కూడా వచ్చింది. ఇందులో షెరిల్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ గురించి మాట్లాడారు.
2015లో ఫేస్‌బుక్ అత్యధికంగా లాభపడింది. ఆ ఏడాదిలో కంపెనీ దాదాపు 3.7 బిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది, అంటే దాదాపు 25 వేల కోట్ల రూపాయలు. ఇదంతా షెర్రిల్ శాండ్‌బర్గ్ కృషి ఫలితమే. ఫేస్‌బుక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఉన్న మొదటి మహిళ కూడా షెరిల్ శాండ్‌బర్గ్. షెరిల్ శాండ్‌బర్గ్ హార్వర్డ్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసింది. ఫేస్‌బుక్‌లో చేరడానికి ముందు షెరిల్ గూగుల్‌లో పని చేసేవారు. ఇంకా అమెరికా ప్రభుత్వంలో కూడా కొంతకాలం పనిచేశారు.