ఈ-కామర్స్ వెబ్‌సైట్ మైంట్రా పై పోలీస్ కేసు.. లోగో మార్పు పై కీలక నిర్ణయం..

First Published Jan 30, 2021, 3:25 PM IST

ఈ-కామర్స్ వెబ్‌సైట్ మైంట్రా తాజాగా ఇబ్బందుల్లో పడింది. దీనికి అసలు కారణం ఆ సంస్థ యొక్క లోగో, ఇది మహిళలను అవమానించడం, అభ్యంతరకరమైనది అని వర్ణించబడింది. దీనికి సంబంధించి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చివరకి సంస్థ లోగోను మార్చాలని నిర్ణయించింది.

మొత్తం కేసు సమాచారం ప్రకారం, 2020 డిసెంబర్‌లో ఎన్‌జిఓ అవెస్టా ఫౌండేషన్‌కు చెందిన నాజ్ పటేల్ ముంబై సైబర్ సెల్‌లో మైంట్రా లోగో పై కేసు పెట్టారు. మైంట్రా లోగోను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నాజ్ పటేల్ సోషల్ మీడియాలో, వివిధ ఫోరమ్లలో అనేక వేదికలలో కూడా ఈ సమస్యను లేవనెత్తారు.
undefined
ముంబై పోలీసు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డిఎస్‌పి రష్మి కరాండికర్ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మైంట్రా లోగో మహిళల పట్ల అభ్యంతరకరంగా ఉందని మేము కనుగొన్నాము. దీనికి సంబంధించి మైంట్రా సంస్థతో ఇమెయిల్ ద్వారా సంప్రదించాము, తర్వాత కంపెనీ అధికారులు వచ్చి మమ్మల్ని కలిశారు. లోగోను మార్చడానికి సంస్థకు ఒక నెల సమయం కావాలని కోరింది.
undefined
లోగో పై అభ్యంతరం వ్యక్తం కావడంతో మైంట్రా కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలో తన వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్‌లోని లోగోను మారుస్తామని కంపెనీ వెల్లడించింది. ఇది కాకుండా, ప్యాకింగ్ మెటీరియల్‌పై కూడా లోగో మార్చబడుతుందని, దీని కోసం కొత్త లోగోతో ప్యాకింగ్ మెటీరియల్ ప్రింటింగ్ కోసం పంపించాము అని తెలిపారు.
undefined
click me!