ఈ వేసవి తాపానికి చల్లటి గాలి కావాలా.. అయితే ఈ కూలింగ్ గాడ్జెట్స్ గురించి తెలుసుకోండి..

First Published Jun 10, 2023, 7:21 PM IST

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. ఈ వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచడానికి మీరు కొన్ని కూల్ గాడ్జెట్‌ల కోసం చూస్తున్నట్లయితే ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. ఈ లిస్ట్ లో  వేరబుల్  ఫ్యాన్‌లు, ఫ్యాన్‌లతో కూడిన ఫేస్ మాస్క్‌లు, USB పవర్డ్ రిఫ్రిజిరేటర్‌లు, పర్సనల్ ఎయిర్ కూలర్‌లు ఇంకా మరెన్నో ఉన్నాయి.
 

మినీ పోర్టబుల్ ఫ్యాన్స్: ఇది  ఒక కాంపాక్ట్ నెక్‌బ్యాండ్-స్టైల్ వేరబుల్  ఫ్యాన్. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది ఇంకా  ముఖంపై నేరుగా గాలిని వీచేలా రూపొందించబడింది. విపరీతమైన వేడితో వ్యవహరించేటప్పుడు ఈ ఫ్యాన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
 

USB డెస్క్ ఫ్యాన్: ఇది ఆఫీస్ స్పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. USB డెస్క్ ఫ్యాన్ 10pcs ఫ్యాన్ బ్లేడ్‌లతో వస్తుంది. ఇది మంచి వెంటిలేషన్‌ను అందిస్తుంది. USB కేబుల్ ద్వారా పనిచేస్తుంది, ఈ ఫ్యాన్ మీ ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్‌లు, వాల్ ఛార్జర్ ఇంకా  మరిన్నింటికి కూడా కనెక్ట్ చేయవచ్చు.
 

కూలింగ్ ఫ్యాన్‌తో కూడిన చిన్న మాస్క్: మాస్క్ అంతర్నిర్మిత ఫ్యాన్‌తో వస్తుంది. ఇది వేడి వేసవి మధ్యాహ్నం మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది. మాస్క్‌లోని ఫ్యాన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 గంటల పాటు పనిచేస్తుంది. ఈ మినీ కూలింగ్ ఫ్యాన్‌కు 300 mAh బ్యాటరీ ఉంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2 గంటలు పడుతుంది.
 

సోలార్ క్యాప్  విత్ ఫ్యాన్: మరొక సూపర్ కూల్ సమ్మర్ గాడ్జెట్ ఏంటంటే ఫ్యాన్‌తో కూడిన టోపీ. ఈ క్యాప్  పైన సోలార్ ప్యానెల్స్‌తో  అమర్చిన ఫ్యాన్‌కి దీని ద్వారా పవర్ లభిస్తుంది. ఈ టోపీ ఫ్యాన్ సూర్య కాంతికి  ఆటోమేటిక్‌గా రన్ అవుతాయి.
 

USB పోర్టబుల్ ఫ్యాన్‌లు: USB పోర్టబుల్ ఫ్యాన్ జేబులో సులభంగా సరిపోతుంది. ఈ ఫ్యాన్‌లను స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా పవర్ బ్యాంక్ వంటి దేనికైనా కనెక్ట్ చేయవచ్చు.
 

ఎయిర్ కూలర్లు: ఎయిర్ కూలర్ అనేది  సాధారణ కూలర్ కి పోర్టబుల్ వెర్షన్. దీనితో  మీరు చల్లటి గాలిని పొందడానికి ఐస్ ప్యాక్ లేదా నీటిని ఉపయోగించవచ్చు.
 

click me!